Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వైసీపీలోని కాపు వర్గీయులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చర్యలతోనే కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో రాజమండ్రిలో ఈ అంశంపై కాపునేతలంతా సమావేశమై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాపులపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై, […]
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. కివీస్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఏ దశలోనూ టార్గెట్‌ను ఛేదించేలా కనిపించలేదు. వరుస వికెట్లు కోల్పోతూ 19.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో రాజపక్స 34, శనక 35 పరుగులు చేశారు. వీరిద్దరూ తప్ప మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. […]
IND Vs SA: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించింది. టీమిండియా మంచి ప్రదర్శనే చేస్తున్నా ఓపెనర్ రాహుల్ ప్రదర్శన మాత్రం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాతో ఆదివారం ఆడనున్న మ్యాచ్‌లో అతడి స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ […]
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతో.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా రామోజీ ఫిలింసింటీలో షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఎప్పుడో పూర్తికావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిమగ్నం కావడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓటీటీ, టీవీ టాక్ షోలతోనూ బిజీ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షోలో […]
NZ Vs SL: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీలో రెండో సెంచరీ నమోదైంది. ఇటీవల దక్షిణాఫ్రికా ఆటగాడు రోసౌ బంగ్లాదేశ్‌పై మెరుపు సెంచరీ చేయగా తాజాగా శ్రీలంకపై న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ బాదాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన ఫిలిప్స్ సెంచరీతో ఆదుకున్నాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో […]
KVP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రాణమిత్రుడు కేవీపీ రామచంద్రరావు ‘పోలవరం-ఓ సాహసి ప్రయాణం’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సదరు పుస్తకంలో కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకుల గురించి అందులో కూలంకుషంగా చర్చించారు. డెల్టా ప్రాంతాలకు, రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులకు నీటిలభ్యత లేకపోవడమే కారణమని ఆనాడు వైఎస్ఆర్ ఆలోచించారని.. అందుకే ఏపీలో సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం […]
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. 2019 వరకు రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 970గా ఉండగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరిగాయి. ఇప్పుడు అదనంగా 746 సీట్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం వచ్చిందని అంటున్నారు. ఈ ఏడాదిలో ఈ సీట్ల పెరుగుదల దాదాపు ఖరారైంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మొత్తంగా రాష్ట్రంలో […]
Pawan Kalyan: కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడులో ముగ్గురు రైతులు విద్యుత్ షాక్‌తో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్‌తో రైతులు దుర్మరణం చెందడం దురదృష్టకరమన్నారు. పంటను కాపాడుకునేందుకు పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లిన ముగ్గురు రైతులు విద్యుత్ […]
Shoib Akthar: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడటంతో తర్వాతి మూడు మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ గెలిచినా సెమీస్ అవకాశం దక్కుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. పాకిస్థాన్ దాదాపుగా ఇంటికి వెళ్లినట్లే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అద్భుతాలు జరిగితే తప్ప పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ నుంచి వరుస ఓటములు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌పై ఆ దేశ మాజీ […]
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాజధాని పరిధిలోని ఐదు గ్రామాలలో 900.97 ఎకరాలను కేటాయించింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాలు, […]