ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై తొలిసారిగా భారత్ ఓడిపోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అందరూ టీమిండియా ఓటమికి కారణాలను వెతికారు. కొందరు కోహ్లీపై విమర్శలు చేశారు.. మరికొందరు మెంటార్ ధోనీ నిర్ణయాలను తప్పుపట్టారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. టీమిండియా ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయనేది నిజం. అయితే క్రికెట్ దేవుడు సచిన్ మదిలో ఏముంది? పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమి గురించి సచిన్ కూడా విశ్లేషణ చేశాడు.
Read Also: ధోని సలహాలను కోహ్లీ పట్టించుకోలేదా?
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 నుంచి 25 పరుగులు తక్కువ చేసిందని సచిన్ అభిప్రాయపడ్డాడు. షహీన్ షా అఫ్రిదిని ఎదుర్కొనే విషయంలో భారత ఆటగాళ్లు సరిగ్గా సన్నద్ధం కాలేదన్నాడు. ముందుగా పాకిస్థాన్ జట్టుతో భారత్ ఆడి చాలా కాలమైందని.. ఆ జట్టులో ఆటగాళ్లు ఎలా ఆడతారో అవగాహన లేకపోవడం టీమిండియాకు మైనస్ అయ్యిందన్నాడు. పాక్ జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నా.. ఐపీఎల్ ద్వారా టీమిండియా ఆటగాళ్లు ఎలా ఆడతారో వాళ్లకు అవగాహన ఉందన్నాడు. షహీన్ షా అఫ్రిది బౌలింగ్ వేగానికి మన ఓపెనర్ల దగ్గర సమాధానం లేకపోయిందని సచిన్ వాపోయాడు. ఆదిలోనే భారత్ మూడు వికెట్లు కోల్పోవడం ద్వారా ఒత్తిడికి గురైందన్న సచిన్.. పాక్ జట్టును అర్థం చేసుకోవడానికి టీమిండియాకు కొంచెం సమయం పడుతుందని పేర్కొన్నాడు.