Ramesh Nalam
Author- NTV Telugu-
తిరుపతి వాసులకు శుభవార్త… నవంబరులో ‘శ్రీనివాస సేతు’ ప్రారంభం
తిరుపతి నగర వాసులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త అందించారు. తిరుపతికి వచ్చే యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టిన శ్రీనివాస సేతు (గరుడ వారధి)ని నవంబరులో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గిరీష్, ఆఫ్ కాన్ సంస్థ ప్రతినిధి రంగ స్వామి ఇతర అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. Read Also: తెలుగుకి ఇప్పుడు […] -
తండ్రి సమాధి వద్దే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం నాడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరోవైపు తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పునీత్ భౌతిక కాయాన్ని విక్రమ్ ఆస్పత్రి నుంచి సదాశివనగర్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ క్రమంలో తమ అభిమాన […] -
మరణానికి ఎలాంటి పక్షపాతం లేదు.. ఆర్జీవీ ట్వీట్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ‘పునీత్ రాజ్‌కుమార్‌ది ఆకస్మిక మరణం. మనలో ఎవరైనా.. ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది భయంకరమైన నిజం. కాబట్టి మనం జీవించి ఉండగానే ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్‌లో జీవించడం ఉత్తమం. మరణానికి ఎలాంటి పక్షపాతం లేదు. అది ఎవరినైనా తన ఇష్టానుసారంగా తీసుకుపోతుంది. చావు అందరికీ సమానమే’ అంటూ తనదైన స్టైలులో […] -
హీరో రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యం వల్లే రజనీకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని కావేరి ఆస్పత్రి శుక్రవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. Read Also: కన్నడ పవర్‌స్టార్ గొప్పతనం ఇదే… కళ్లను […] -
కేసీఆర్, రేవంత్‌పై మంత్రి పేర్ని నాని సెటైర్లు
తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్ మాట తప్పారని, దిండి, పాలమూరు వంటి ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు నీళ్లు మళ్ళించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తమకు కేటాయించిన నీళ్లకు అదనంగా చెంచాడు నీళ్లు కూడా వాడుకోబోమని ఎప్పుడో చెప్పామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎంత దూరమో […] -
పునీత్ మృతి పట్ల దిగ్భ్రాంతికి గురైన చిరంజీవి, మహేష్ బాబు
న్నడిగుల ఆరాధ్య దైవం రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్ కుమార్ కొద్ది సేపటి క్రితం గుండె పోటుతో కన్నుమూశాడు. పునీత్ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. కాగా పునీత్ మృతి పట్ల టాలీవుడ్ అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని, ఈ వార్త విన్న […] -
కన్నడ పవర్‌స్టార్ గొప్పతనం ఇదే… కళ్లను దానం చేసిన పునీత్
కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్లకే గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అయితే పునీత్ రాజ్ కుమార్ తన మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడనున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కళ్లను దానం చేయనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. Read Also: పునీత్ రాజ్ కుమార్ నట […] -
హైదరాబాద్‌లో దారుణం.. మూత్రం తాగాలని భర్త వేధింపులు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను తన భర్త, అతడి కుటుంబసభ్యులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్ధనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని భర్త వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. 2016లో తమ వివాహమైన నాటి నుంచి వేధింపులు కొనసాగుతున్నాయని వాపోయింది. మరోవైపు కులం పేరుతో తన భర్త కుటుంబసభ్యులు దూషిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. Read Also: వైరల్: పెళ్లి వేడుకల్లో అనుకోని అతిథి… జనాల పరుగులు కాగా […] -
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు
భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో లియాండర్ పేస్ చేరాడు. దీంతో గోవా అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా సమక్షంలో లియాండర్ పేస్ టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నాడు. కోల్‌కతాకే చెందిన లియాండర్ పేస్ తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌లో అనేక సంచలనాలు సృష్టించాడు. Read […] -
యాదాద్రి ఆలయానికి భారీ విరాళం సమర్పించిన మంత్రి మల్లారెడ్డి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 125 కిలోల బంగారాన్ని విరాళాలుగా సేకరించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు భారీ ఎత్తున స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి చామకూర మల్లారెడ్డి భారీ విరాళాలను యాదాద్రి ఆలయ స్వామివారికి సమర్పించారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయడం కోసం మేడ్చల్ నియోజకవర్గం నుంచి సేకరించిన రూ.1.83 కోట్లను గురువారం నాడు యాదాద్రి ఆలయ ఈవోకు అందజేశారు. ఈ నగదుతో మూడున్నర కిలోల బంగారం సమకూరుతుంది. Read Also: తెలంగాణలో […]
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?