Ramesh Nalam
Author- NTV Telugu-
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృవియోగం
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శాంతమ్మ (78) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. శాంతమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృవియోగం కలిగిన విషయం తెలుసుకున్న పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయనకు సంతాపం తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Read Also: […] -
భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఈటెల రాజేందర్
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని 262వ నంబర్ పోలింగ్ బూత్‌లో తన భార్య జమునతో కలిసి ఈటెల రాజేందర్ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ సరళిని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ప్రజలు తమ గుండెల్లోని బాధలను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడమే దీనికి నిదర్శనమన్నారు. […] -
భారత్‌లోనే తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రం: మంత్రి కేటీఆర్
ఫ్రెంచ్ సెనేట్‌లో ‘యాంబిషన్ ఇండియా-2021’ బిజినెస్ ఫోరంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ఏడేళ్లలో తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో టీఎస్ ఐపాస్ గురించి కూడా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రమని, తెలంగాణ ప్రభుత్వ టీఎస్ ఐపాస్ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ ధృవీకరణను అనుమతిస్తుందని కేటీఆర్ చెప్పారు. చట్టం ప్రకారం 15 రోజులలో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి […] -
తెలుగు రాష్ట్రాల్లో రేపటి ఉపఎన్నికలకు సర్వం సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాడు ఉప ఎన్నికల హడావిడి నెలకొంది. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం నాడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.ముఖ్యంగా హుజురాబాద్‌లో పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా కాస్ట్‌లీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో గెలుపు ఇరుపార్టీలకు చాలా అవసరం. ప్రజల్లో తమపై వ్యతిరేకత […] -
‘మంగళవారం మరదలు’ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ ‘మంగళవారం మరదలు’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడలేదని.. ఏకవచనం వాడలేదని క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడిన భాషలో ఏదైనా తప్పు ఉంటే చింతిస్తున్నానని వెల్లడించారు. షర్మిల తన కుమార్తె కంటే పెద్దది… సోదరి కంటే చిన్నది. తండ్రి సమకాలీకుడైన సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో ఆమె సంభోదించడం సంస్కారమేనా?’ అని నిరంజన్‌రెడ్డి షర్మిలకు చురకలు అంటించారు. […] -
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
దీపావళి పండగ వేళ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గుడ్ న్యూస్ అందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అందించే వడ్డీని దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనుంది. దీంతో దాదాపు 6.5 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని చందాదారులకు పండగకు ముందే అందించనున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ విషయమై త్వరలోనే […] -
బంగ్లాదేశ్‌ను 3 పరుగుల తేడాతో ఓడించిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో భాగంగా షార్జాలో జరిగిన బంగ్లాదేశ్-వెస్టిండీస్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరకు వెస్టిండీస్ జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. వెస్టిండీస్ టాపార్డర్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4), హెట్‌మెయిర్ (9), ఆండ్రీ రస్సెల్ (0) విఫలమయ్యారు. బ్యాటింగ్ చేస్తూ మధ్యలో మైదానాన్ని వీడిన కెప్టెన్ పొలార్డ్ […] -
దేశంలో రైతుల ఆత్మహత్యలు… ఏపీ@3, తెలంగాణ@4
2019తో పోలిస్తే 2020లో దేశవ్యాప్తంగా 18 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల అంశంపై నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో 10,677 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ జాబితాలో మహారాష్ట్ర టాప్‌లో నిలిచింది. ఆ రాష్ట్రంలో 4,006 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలు టాప్-5లో ఉండటం గమనించాల్సిన విషయం. Read Also: వాహనదారుల్లో రాని మార్పు 2020లో రైతుల […] -
‘RRR’ టీజర్ గ్లింప్స్ విడుదల వాయిదా
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల కావాల్సిన ‘రౌద్రం రణం రుధిరం (RRR)’ టీజర్ గ్లింప్స్ వాయిదా పడింది. త్వరలో టీజర్ గ్లింప్స్ విడుదల తేదీపై క్లారిటీ ఇస్తామని RRR యూనిట్ తెలిపింది. ఈ టీజర్ గ్లింప్స్ నిడివి 40 సెకన్ల పాటు ఉంటుందని తెలుస్తోంది. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల చేయాలని భావించారు. అందులో భాగంగా […] -
‘మీది చనిపోయే వయసు కాదు’.. పునీత్ మృతిపై ప్రధాని మోదీ ట్వీట్
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. భారత ప్రధాని మోదీ కూడా పునీత్ మృతి పట్ల సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘విధి ఎంతో క్రూరమైనది. పునీత్ రాజ్‌కుమార్ లాంటి ఒక గొప్ప వ్యక్తి, మంచి నటుడిని మనందరికీ దూరం చేసింది. పునీత్ రాజ్‌కుమార్ కృషి, వ్యక్తిత్వం భవిష్యత్ తరాలలో స్ఫూర్తి నింపుతుంది. మీది చనిపోయే వయసు కాదు. పునీత్ కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.. […]
తాజావార్తలు
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
-
Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్‌లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
-
Telangana Rains: గోదావరి ఉగ్రరూపం.. ములుగు జలదిగ్బంధం, జూరాల గేట్లు ఎత్తివేత.!
-
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
-
Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!