CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
- స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు
- విదేశీ ఉద్యోగాలకు భాషా శిక్షణ, TOMCOM కీలక బాధ్యతలు
- ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, EV-డ్రోన్ కోర్సులు
- నర్సింగ్ కాలేజీల విస్తరణపై సీఎం కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కార్మిక, ఉపాధి కల్పన (శక్తి) శాఖపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా సీఎం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అధునాతన రీతిలో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా యూనివర్సిటీలో ప్రత్యేక ‘రీసెర్చ్ సెంటర్’ను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా, తెలంగాణ యువతకు విదేశాల్లో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తున్న నేపథ్యంలో, దానికి అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీలోనే విదేశీ భాషలు నేర్పించేందుకు ప్రత్యేక వింగ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు.
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ఏటీసీల్లో ఈవీ డిమాండ్ కోర్సులు
ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యంతో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం పెంచేందుకు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో (ATC) మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సర్వీసింగ్ కోర్సులతో పాటు ‘డ్రోన్ టెక్నాలజీ’ సంబంధిత కోర్సులను తక్షణమే ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విదేశాలకు వెళ్లాలనుకునే నిరుద్యోగ యువతకు పాస్‌పోర్ట్ ఇప్పించే ప్రక్రియ నుంచి మొదలుకొని, విదేశీ కంపెనీల్లో సరైన ఉద్యోగాలు సాధించే వరకు అన్ని బాధ్యతలను టామ్కామ్యే దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. దీనితో పాటు, అంతర్జాతీయంగా రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు తగిన అనుమతులు మంజూరు చేయాలని అధికారులను కోరారు.
Also Read
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
తాజావార్తలు
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!