టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ విజయానికి గట్టి పునాది పడింది. అబుదాబీ వేదికగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఓపెనర్ రిజ్వాన్‌ను అంపైర్ ఎల్బీగా అవుట్ చేయగా రివ్యూ తీసుకున్న పాకిస్థాన్ విజయవంతమైంది.
అనంతరం ఓపెనర్లు రిజ్వాన్ (79 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (70) తొలి వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం అందించారు. 14.2 ఓవర్ల వద్ద పాక్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. బాబర్ ఆజమ్ అవుటైన తర్వాత ఫకార్ జమాన్ (5) వెంటనే అవుటయ్యాడు. అయితే హఫీజ్ (32 నాటౌట్)తో కలిసి రిజ్వాన్ మెరుపు బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ జట్టు 189/2 భారీ స్కోరు సాధించింది. చివరి ఆరు ఓవర్లలో 70కి పైగా పరుగులు పాక్ రాబట్టింది. నమీబియా బౌలర్లలో డేవిడ్ వీస్, ఫ్రైలింగ్ చెరో వికెట్ సాధించారు.
Read Also: విరాట్‌కు కోహ్లీకి షాక్..