తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది: బీజేపీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో వేములవాడ ఉపఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు. అలాగే తమతో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని రఘునందన్‌రావు పేర్కొన్నారు.
Read Also: కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు: షర్మిల
Also Read
కాగా ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన పౌరసత్వంపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఆయనది భారతీయ పౌరసత్వం కాదని, ఆయనకు ఇంకా జర్మనీ పౌరసత్వం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. భారత పౌరసత్వం లేకుండా ఎమ్మెల్యేగా ఉండే అర్హత చెన్నమనేని రమేష్‌కు లేదంటూ బీజేపీ వాదిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. అయితే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని బీజేపీ ఆశిస్తోంది. దీంతో వేములవాడలో త్వరలో ఉప ఎన్నిక జరుగుతుందని ఆ పార్టీ నేతలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే వేములవాడ ఉపఎన్నికలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!