తెలంగాణలోని పలు ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై అల్పపీడనం ఆవరించి ఉందని, దీని నుంచి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు, గురువారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది.
Read Also: కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసిందెవరు?
మరోవైపు తెలంగాణలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 109 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. అత్యధికంగా జనగామ జిల్లా కోలుకోండలో 7.1, జాఫర్‌గఢ్‌లో 5.2, పాలకుర్తిలో 4.3, వర్ధన్నపేటలో 3.2, పంగల్‌లో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసిందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో చలి పెరిగిందని… ఆదిలాబాద్ జిల్లా అర్లిలో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.