దేశాన్ని మరోసారి జికా వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా యూపీలో జికా వైరస్ కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే యూపీలో 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఆరుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వ్యక్తులు, 14 మంది మహిళలు ఉన్నారు. యూపీలో ఎక్కువగా కాన్పూర్ ప్రాంతంలో జికా వైరస్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న కాన్పూర్‌లో తొలి జికా వైరస్ వెలుగు చూసింది.
Read Also: మార్కెట్‌లోకి బఫర్ స్టాక్.. తగ్గిన ఉల్లి ధరలు
ఇప్పటివరకు 586 మంది రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం అధికారులు ల్యాబ్‌కు పంపారు. వీటి ఫలితాలు వస్తే మరిన్ని కేసులు వెలుగు చూసే అవకాశముంది. జికా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేకంగా వైద్యశాఖ టీమ్‌లను ఏర్పాటు చేస్తోంది. కాగా దోమల కారణంగా జికా వైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో కాన్పూర్ వ్యాప్తంగా ప్రభుత్వం పారిశుధ్య చర్యలను చేపట్టింది.