సోషల్ మీడియా పరిధి విస్తృతం కావడంతో పలు సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే పుష్ప, రాధే శ్యామ్, సర్కారు వారి పాట సినిమాలకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు లీకుల బారిన పడ్డాయి. ఇప్పుడు రాజమౌళి సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’కు కూడా లీకుల బారిన పడిందని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. ఆ లీకైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఎన్టీఆర్ తలకు రుమాలు చుట్టుకుని… వెనకాల తుపాకీ తగిలించుకుని కనిపిస్తున్నాడు.
Read Also: దీపావళి పండగ స్పెషల్.. చెర్రీ అండ్ బన్నీ ఫ్యామిలీ ఫోటో
మరోవైపు ఆర్.ఆర్.ఆర్ నుంచి ఇటీవల విడుదలైన టీజర్ ప్రోమో విజువల్ ఫీస్ట్‌గా అదరగొట్టింది. ఈ మూవీలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, గిరిజన వీరుడు కొమురంభీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రానుంది. సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.