తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కిడ్నీ వాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల్లో తక్షణమే డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎయిడ్స్ రోగులకు 5, హెపటైటిస్ రోగుల కోసం మరో 5 పడకలను కేటాయించాలన్నారు. Read Also: తెలంగాణ […]
ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించే దిశా కమిటీలో తనకు స్థానం కల్పించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. దిశా కమిటీలో ‘ప్రముఖ సభ్యుడు’ (ఎమినెంట్ మెంబర్)గా తనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నియమించిందని, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఈ కమిటీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు సరిగ్గా జరిగే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది ప్రారంభంలో జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌తో తిరిగి జట్టులోకి పునరాగమనం చేసిన అతడు.. ఎక్కువకాలం టెస్టుల్లో కొనసాగేందుకు సిద్ధంగా లేనని ఆ సమయంలోనే బోర్డుకు సూచించాడు. దీంతో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్‌లో 50 టెస్టులు ఆడిన మహ్మదుల్లా 33.11 […]
టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొద్దిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సహా పలువురు ప్రముఖులు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. మరోవైపు భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య దంపతులు గురువారం నాడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. Read Also: చంద్రబాబుకు నమస్కారం చేసిన వైసీపీ […]
ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలన ప్రారంభించి 100 రోజులు పూర్తయింది. అమెరికా బలగాలు ఆప్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు అక్కడి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తమ చేతుల్లో తీసుకుని పాలించడం మొదలుపెట్టారు. తాలిబన్లు అధికారంలోకి రావడంతో అఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా మహిళల హక్కులను తాలిబన్లు హరించివేస్తున్నారనే అపవాదు వచ్చింది. మీడియాపైనా తాలిబన్లు పలు రకాల ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పలువురు పౌరులు దేశాన్ని విడిచి […]
ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. మరి వారు బాధ్యతను మరిచి వివాదాల జోలికి వెళ్తున్నారా… లేదంటే తాము లైమ్‌లైట్‌లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా అనే విషయం దేవుడికే తెలియాలి. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి, కాంగ్రెస్ నేత రోడ్లను ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో పోల్చారు. రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ రెండు రోజుల కిందట క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేశారు. ఈ సందర్భంగా […]
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలలో వరదలు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో భారీ స్థాయిలో వరద నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ప్రస్తుతం వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో అధికారులు వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వరదల వల్ల మొత్తం రూ. 6,054 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. Read Also: ఈ […]
టీ20 ర్యాంకింగ్స్‌ను బుధవారం నాడు ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒకే ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆ ఆటగాడే కేఎల్ రాహుల్. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. దీంతో అతడు 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 809 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 805 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ రెండో […]
గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రౌడీల తరహాలో రెచ్చిపోయారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త సైదాను అత్యంత దారుణంగా కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్‌ను మించిపోయిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
హైదరాబాద్ నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థగా పేరుపొందిన మెట్రో రైలు సంస్థ నష్టాల్లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోకు రోజుకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన తెలిపారు. మరోవైపు గత త్రైమాసికంలో మెట్రో సంస్థకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో సంస్థ ఆర్థిక ఇబ్బందులను వివరించినట్లు కేవీబీ రెడ్డి తెలిపారు. […]