హైదరాబాద్ నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థగా పేరుపొందిన మెట్రో రైలు సంస్థ నష్టాల్లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోకు రోజుకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన తెలిపారు. మరోవైపు గత త్రైమాసికంలో మెట్రో సంస్థకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో సంస్థ ఆర్థిక ఇబ్బందులను వివరించినట్లు కేవీబీ రెడ్డి తెలిపారు.
Read Also: గౌతం గంభీర్‌కు ఉగ్రవాదుల బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం
మరోవైపు మెట్రో బెయిల్ ఔట్‌కు కమిటీ ఏర్పాటు చేశామని కేవీబీ రెడ్డి చెప్పారు. నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తామని చెప్పారని.. కానీ నాలుగు వారాలు దాటినా ఎలాంటి పురోగతి కనిపించలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే హైదరాబాద్ మెట్రో మరిన్ని నష్టాలు చవిచూడాల్సి వస్తుందని కేవీబీ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మెట్రోను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా గతంలో మాదిరిగా మెట్రో స్టేషన్‌లలో షాపింగ్ మాల్స్ నిర్వహణ సరిగా లేకపోవడం, యాడ్స్ ఆదాయం తగ్గడంతో నష్టాలు పెరుగుతున్నాయని ఎల్‌అండ్‌టీ అధికారులు చెబుతున్నారు.