Spring Fields: 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్య కాలం మానవజాతి చరిత్రలో ఆర్థిక, సాంస్కృతిక, వైజ్ఞానిక వికాసానికి విశేషమైన కాలమే ఇస్లాం స్వర్ణయుగం. ఇస్లాం పెరుగుదల, వ్యాప్తి ఒక గొప్ప శాస్త్రీయ, మేధో విప్లవాన్ని ప్రేరేపించింది. ముస్లిం శాస్త్రవేత్తలు గణిత శాస్త్రం, వైద్యం, ఖగోళ శాస్త్రం, ఆప్టిక్స్, రసాయన శాస్త్రంలో గణనీయమైన అభివృద్ధిని సాధించారు. కానీ 800 సంవత్సరాల ఈ గొప్ప వారసత్వం యూరో-కేంద్రీకృత సంస్కృతితో కప్పివేయబడింది. ఇస్లాంకు సంబంధించిన చాలా ఆవిష్కరణలు ఈ […]
Chandra Babu: ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1 వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు ఈ జీవోపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోను హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును నిలిపివేయాలంటూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవో నెం.1పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ […]
Ricky Ponting: కారు యాక్సిడెంట్ కారణంగా తీవ్రంగా గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది. దీంతో అతడు ఐపీఎల్-2023కి అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో పంత్ గైర్హాజరీపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. అతడి సేవలు కోల్పోవడం బాధాకరమని వెల్లడించాడు. అయితే ఒకవేళ పంత్ శరీరం ప్రయాణం చేయడానికి సహకరిస్తే అతడిని తమతో పాటు మ్యాచ్‌లకు తీసుకువెళ్తామని చెప్పాడు. పంత్ లాంటి సరదా […]
ICC: ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. దీంతో అందరూ ఆన్‌లైన్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. అయితే ఇదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి. చాలా మంది సామాన్యులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. విచిత్రం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను నడిపించే ఐసీసీ కూడా సైబర్ నేరగాడి వలలో పడింది. 2.5 మిలియన్ డాలర్లకు పైగా ఐసీసీ మోసపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ కరెన్సీలో 2.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20 కోట్లు. దుబాయ్‌లోని […]
Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని రెజ్లర్లు భారత ఒలింపిక్ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషకు వారు లేఖ రాశారు.రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అవకతవకలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు నాలుగు డిమాండ్లు చేశారు. ‘డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. డబ్ల్యూఎఫ్‌ఐలో చాలా అవకతవకలు […]
Naga Babu: ఏపీ ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను పరిష్కరానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడంలేదంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. […]
Jowar Roti: పూర్వం జొన్నరొట్టె, రాగి సంగటి, సద్దరొట్టె లాంటి ఆహారాలను ఎక్కువగా తినేవారు. అందుకే మన పెద్దలు చాలా బలంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం జీవించేవాళ్లు. కానీ టెక్నాలజీతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా చాలామంది ఇలాంటి ఆహార పదార్థాలను మర్చిపోయారు. కానీ ప్రస్తుత రోజుల్లో జొన్న రొట్టె, సద్ద రొట్టె లాంటి వాటిని చాలామంది ఇష్టపడరు. అయితే షుగర్ పేషెంట్లు, డైటింగ్ చేసేవాళ్లు మాత్రమే జొన్నరొట్టెలు తింటూ కనిపిస్తున్నారు. కానీ జొన్నరొట్టెలను […]
IND Vs NZ: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 337 పరుగులకు ఆలౌట్ చేశారు. అయితే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ బ్రేస్‌వెల్ టీమిండియాను వణికించాడు. 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో వీరవిహారం చేసిన అతడు 140 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుతిరిగాడు. దీంతో ఉత్కంఠభరితంగా […]
Andhra Pradesh: సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంక్రాంతి లక్కీ డ్రా టిక్కెట్లను ఒక్కొక్కటి రూ.100 చొప్పున మంత్రి అంబటి రాంబాబు సహా వైసీపీ నేతలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ […]
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశమంతా రైతు బంధు, ఉచిత కరెంటు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశమంతా రైతు బంధుతో పాటు ఉచిత కరెంటు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కష్టాలు, కన్నీళ్ల నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందని, సహజ వనరులు ప్రజలకు దక్కేలా చూడటమే ఈ పార్టీ లక్ష్యమని తెలిపారు. మోడీ హయాంలో తెలంగాణలో తప్ప దేశమంతటా కరెంటు కోతలే […]