IND Vs NZ: వణికించిన బ్రేస్‌వెల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs NZ: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 337 పరుగులకు ఆలౌట్ చేశారు. అయితే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ బ్రేస్‌వెల్ టీమిండియాను వణికించాడు. 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో వీరవిహారం చేసిన అతడు 140 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుతిరిగాడు. దీంతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. భారత బౌలర్లలో సిరాజ్ మరోసారి అదరగొట్టాడు. సిరాజ్ తన హోంగ్రౌండ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. కుల్దీప్, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు సాధించారు. షమీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.
Read Also: India: జనాభాలో ఇక ఇండియా ఫస్ట్ ప్లేస్.. చైనాను మించినట్లు అంచనా..
Also Read
- Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
- IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
- Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
అంతకుముందు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో న్యూజిలాండ్ బౌలర్లను శుభ్‌మన్ గిల్ చితక్కొట్టాడు. అయితే ఎప్పటిలాగే టాప్ ఆర్డర్ వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు టెయింలెండర్ల వికెట్లను తీయడంలో తడబడ్డారు. బ్రేస్‌వెల్, శాంట్నర్ ఏడో వికెట్‌కు సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!