Jowar Roti: పూర్వం జొన్నరొట్టె, రాగి సంగటి, సద్దరొట్టె లాంటి ఆహారాలను ఎక్కువగా తినేవారు. అందుకే మన పెద్దలు చాలా బలంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం జీవించేవాళ్లు. కానీ టెక్నాలజీతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా చాలామంది ఇలాంటి ఆహార పదార్థాలను మర్చిపోయారు. కానీ ప్రస్తుత రోజుల్లో జొన్న రొట్టె, సద్ద రొట్టె లాంటి వాటిని చాలామంది ఇష్టపడరు. అయితే షుగర్ పేషెంట్లు, డైటింగ్ చేసేవాళ్లు మాత్రమే జొన్నరొట్టెలు తింటూ కనిపిస్తున్నారు. కానీ జొన్నరొట్టెలను ప్రతిరోజూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
జొన్నరొట్టెలో ఐరన్, కాల్షియం, విటమిన్ బి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ రూపంలో కూడా తినొచ్చు. ఊబకాయంతో బాధపడేవాళ్లు బరువు తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది. జొన్నరొట్టెలు కేవలం డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే కాకుండా అందరికీ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అటు గోధుమ పిండి చపాతీతో పోలిస్తే జొన్నలతో చేసిన రోటీని తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే భోజనంతో పాటు జొన్నరొట్టెను తింటే మంచిది. జొన్నలో మెగ్నీషియం, ప్రోటీన్, డైటరీ ఫైబర్ ఉన్నాయి, ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. జొన్నలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జొన్న పిండి గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ప్రతిరోజూ భోజనంలో జొన్నరొట్టెను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.