✍ నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన… పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న సీఎం జగన్.. రాత్రికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి రిసెప్షన్‌కు హాజరుకానున్న జగన్✍ తిరుపతి వేదికగా నేడు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ.. ‘అమరావతి అందరిదీ’ పేరుతో రైతు భారీ బహిరంగ సభ… మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సా.6 గంటల వరకు సభ… హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు✍ నేడు తిరుమల వెళ్లనున్న చంద్రబాబు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోనున్న […]
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని… ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఫెయిల్ చేశారని ట్విట్టర్‌లో ఆరోపించాడు. తన సూసైడ్‌కు మంత్రులు కేటీఆర్, సబితలే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. దీంతో క్షణాల్లోనే ఇంటర్ విద్యార్థి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. Read […]
ప్రస్తుతం టీమిండియాలో విరాట్ కోహ్లీ-గంగూలీ ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై విరాట్ కోహ్లీ అసంతృప్తిగా ఉన్నాడనే విషయం అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తనకు చెప్పకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని.. టీ20 కెప్టెన్సీకి తాను రాజీనామా చేసినప్పుడు తనకు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలనే విషయం చెప్పలేదని కోహ్లీ చెప్పడంతో వివాదం చెలరేగింది. మరోవైపు విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని చెప్పినా వినలేదని గతంలో గంగూలీ చెప్పిన […]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జనసేన కార్యాలయానికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం నాడు గుంటూరు జిల్లా కుంచనపల్లిలో పర్యటించిన నారా లోకేష్… అనూహ్యంగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జనసేన కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. కుంచన పల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పార్టీ విషయాలను జనసేన నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. Read Also: వెంకయ్య మనవరాలి రిసెప్షన్‌కు హాజరుకానున్న […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తెలుగు మీడియా ప్రెస్‌మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ… ఒక డైరెక్టర్ హీరోను ప్రేమిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో.. ఆ సినిమానే పుష్ప అని స్పష్టం చేశాడు. దర్శకుడు సుకుమార్ కెరీర్‌లో పుష్ప అనేది ఒక సినిమా కాదని.. తన మీద ప్రేమను చూపించుకోవడానికే తీసిన సినిమా లాగా […]
ఈనెల 17న ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జగన్ ప్రారంభించనున్నారు. సాయంత్రం 4:10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో విశాఖ వెళ్లనున్న ఆయన… సాయంత్రం 5:10 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో ఆరు ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కలనాయుడు బాబు కుమార్తె దివ్యానాయుడు వివాహ వేడుకకు సీఎం […]
జాతీయ స్థాయి మహిళా యువ షూటర్ కొనికా లాయక్ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. కోల్‌కతాలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్న స్థితిలో కొనికా లాయక్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో భారత క్రీడా రంగంలో విషాదం నెలకొంది. అయితే తాను ఇష్టపడి ఎంచుకున్న షూటింగ్ క్రీడలో రాణించలేకపోవడం వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు కొనికా లాయక్ ఓ సూసైడ్‌నోట్ రాసిందని పోలీసులు చెప్తున్నారు. హాస్టల్ గదిలోనే ఈ సూసైడ్ […]
ఏపీలో జగన్ సర్కారుపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో టీడీపీ సోషల్ మీడియా విభాగం సమన్వయకర్త సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు సీఐడీ పోలీసులు ప్రయత్నించారని.. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ఎమ్మెల్యే గోరంట్ల ప్రశ్నించారు. సోషల్ మీడియా పోస్టుల అంశంలో కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం సంతోష్ భార్య నిండు గర్భవతి అని, ఆమె ఆసుపత్రిలో ఉందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో సంతోష్ ను […]
ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పిలుపు అందింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతోనే డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గురువారం సాయంత్రం సోనియాతో డీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాతే డీఎస్ చేరికపై […]
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఈనెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాకు చేరుకుంది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫేస్ షీల్డులు, ఫేస్ మాస్కులతో దక్షిణాఫ్రికా చేరుకున్నట్లు బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా తమ దేశానికి చేరుకున్న తరువాత భారత క్రికెట్ జట్టు కఠినమైన నిర్బంధంలో నివసించాల్సిన అవసరం లేదని ఇప్పటికే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొన్న విషయం తెలిసిందే. Read […]