విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ నటుడి అవతారం ఎత్తారు. ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ పథకంపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఉపాధ్యాయుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి త్రినాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read Also: ఒమిక్రాన్‌కు మందు […]
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఎల్లుండి ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్‌లు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి మాసానికి సంబంధించి రోజుకు 10వేల చొప్పున టోకెన్‌లను ఈనెల 27న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే వైకుంఠ ఏకాదశి వేడుకలు ఉన్న సందర్భంగా జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల టోకెన్‌లను మాత్రమే అందుబాటులో ఉంచుతామని టీటీడీ పేర్కొంది. Read Also: నాసా ప్రయోగం సక్సెస్… […]
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. గయానా నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా నింగిలోకి అతిపెద్ద వెబ్ స్పేస్ టెలీస్కోప్‌ను విజయవంతంగా నాసా సైంటిస్టులు ప్రవేశపెట్టారు. దీని ద్వారా విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను వెబ్ స్పేస్ టెలీస్కోప్ పరిశోధనలు జరపనుంది. ఓ రకంగా ఇది గత కాలానికి చెందిన ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్‌లాంటిది. 21 అడుగుల పొడవైన వెబ్ స్పేస్ […]
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ మాట్లాడుతూ… పేపర్ మీద టీమిండియా జట్టు బలంగా కనిపిస్తున్నా గెలుపు మాత్రం తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. హోం గ్రౌండ్‌లో పరిస్థితులు తమకే అనుకూలంగా ఉంటాయని ఎల్గార్ తెలిపాడు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టీమిండియా మంచి ఆటతీరును కనిపరిచిందని.. అందుకే తాము […]
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన యూనిట్.. తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ.. ఈ మూవీ మన మనసుకు, నమ్మకానికి మధ్య జరిగే పోరాటం అని చెప్పాడు. ఇది జరిగిపోయిన స్టోరీ కాదు.. జరగబోయే స్టోరీ కాదు… ఎప్పుడూ నడుస్తున్న స్టోరీనే […]
కరోనాకు మందు తయారుచేసి సంచలనం సృష్టించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌కు కూడా మందు తయారు చేశారు. సుమారు 22 రకాల దినుసులతో ఈ మందును తయారుచేసినట్లు ఆనందయ్య వెల్లడించారు. ఒమిక్రాన్ సోకకుండా అందరూ ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ మాదిరి ఈ మందును వేసుకోవాలని ఆనందయ్య సూచించారు. ఈ మందును ఒకేరోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ మేరకు ఒమిక్రాన్ మందును పంపిణీ చేస్తున్నట్లు ఆనందయ్య పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వారు […]
ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే టిక్‌టాక్ యాప్ ఎంతగానో పాపులర్ అయ్యింది. లాక్‌డౌన్‌లో ఈ యాప్‌ను తెగవాడేశారు. కొన్ని కోట్ల వీడియోలను ఈ యాప్ ద్వారా యూజర్లు అప్‌లోడ్ చేశారు. అయితే ఈ యాప్ వల్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిషేధించింది. అయినా ఈ ఏడాది టిక్‌టాక్ యాప్ మోస్ట్ పాపులర్ యాప్‌గా నిలిచింది. ఈ విషయాన్ని ఐటీ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్ ఫ్లేర్ ప్రకటించింది. Read Also: మొబైల్ రీఛార్జ్ […]
క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ కూడా సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా వేర్వేరు సంవత్సరాల్లో తాను క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ఫోటోలను కూడా సచిన్ షేర్ చేశాడు. ఇందులోని ఓ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్య గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్యగా ఓ బాలికతో సందడి చేస్తున్నట్లు ఉంది. ఈ ఫోటో 2018లో తీసినట్లు సచిన్ […]
ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నోవోటెల్ హోటల్‌లో తన భార్య భారతితో కలిసి జగన్ సీజేఐను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి సీజేఐతో జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతకుముందు క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పర్యటనకు కడప జిల్లా వెళ్లిన జగన్ ఈరోజు మధ్యాహ్నమే విజయవాడకు చేరుకున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ […]
టీమిండియా దిగ్గజ బౌలర్ హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే హర్భజన్ త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై స్వయంగా హర్భజన్ వెల్లడించాడు. తాను పుట్టిన పంజాబ్ రాష్ట్రానికి సేవ చేయాలని భావిస్తున్నానని.. అయితే అది రాజకీయాల రూపంలోనా లేదా ఇతర రూపంలోనా అన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భజ్జీ తెలిపాడు. తనకు రాజకీయ రంగం గురించి […]