శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి గార మండలం రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిని హత్య చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఈ మేరకు సర్పంచ్‌పై కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే… మంగళవారం రాత్రి మరురానగర్‌లోని సర్పంచ్ కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకెళ్లింది. Read Also: గుడ్ న్యూస్… ఏపీలో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు […]
షాద్‌నగర్ రైల్వేస్టేషన్‌లో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి పండగకు ఊరెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వచ్చేందుకు రైల్వేకోడూరులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. కాచిగూడ వరకు టిక్కెట్ కొనుగోలు చేసింది. అయితే మంగళవారం ఉదయం 5:30 గంటలకు రైలు షాద్‌నగర్‌లో ఆగిన సమయంలో ఆమె రైలు దిగింది. అది కాచిగూడ కాదని తెలుసుకుని రైలు ఎక్కే క్రమంలో.. అప్పటికే రైలు కదలడంతో జారి రైలు కింద పడిపోయింది. […]
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈ ఏడాది స్థానం దక్కలేదు. ఈసారి గణతంత్ర వేడుకలకు మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే కవాతులో పాలుపంచుకోనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన శకటాలే […]
కొందరు వ్యక్తులకు సరికొత్త ఆవిష్కరణలు చేయడమంటే చాలా ఇష్టం. అలాంటి వారు ఎవరూ చేయని ఆవిష్కరణలు చేసి వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి కూడా ఇలాగే ఆలోచించి ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌ను రూపొందించాడు. అయితే ఈ సైకిల్‌ను అతడు తయారుచేసిన పద్ధతి తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే అతడు వాడి పారేసిన వస్తువులతో ఈ సైకిల్ తయారుచేయడం విశేషం. ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి రీసైక్లింగ్ వస్తువులతో అతి పొడవైన […]
ఖమ్మం బ్రాహ్మణ బజార్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఓ ఖాళీ స్థలంలో ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో భారీ చెట్టు కూలి పక్కనే ఉన్న గోడ మీద పడింది. దీంతో గోడ కూడా కూలింది. దీంతో గోడ పక్కనే ఆడుకుంటున్న చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు గాయపడగా స్థానికులు వెంటనే వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. Read Also: మీకు కరోనా సోకిందా.. అయితే ఈ మందులు […]
కరోనా వైరస్ సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వర్తింపచేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే ఈ కారుణ్య నియామకాల వర్తింపు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. Read Also: గుడ్ […]
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్ ధరను తాజాగా ప్రభుత్వం సవరించింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను పరీక్షించేందుకు ఒక్కో టెస్టుకు రూ.475, అలాగే ఎన్‌ఏబీఎల్ ల్యాబ్‌లలో అయితే రూ.499 వసూలుచేస్తున్నారు. ఇప్పుడు దానిని రూ.350గా నిర్ణయించారు. ఈ మేరకు ఆస్పత్రులు, ల్యాబ్‌లలో తప్పనిసరిగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ […]
★ నేడు ఏపీ వ్యాప్తంగా పురపాలక కార్మికుల ఛలో కలెక్టరేట్ కార్యక్రమం… సమస్యలు పరిష్కరించాలని పురపాలక కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య పిలుపు★ నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాయలసీమలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన… నేడు బనగానపల్లిలో పర్యటించనున్న సోము వీర్రాజు.. నేడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొననున్న సోము వీర్రాజు★ నేడు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం… మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు అధ్యక్షతన సమావేశం… హాజరుకానున్న బండి […]
ఉగాండాలో ఓ తెలుగు అమ్మాయి చిన్నతనంలో కీర్తిప్రతిష్టలు సంపాదించుకుంటోంది. చదివేది 9వ తరగతి అయినా ఉగాండా అధ్యక్షుడి చేత ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 14 ఏళ్ల వయసున్న తెలుగు అమ్మాయి గొల్లపల్లి ప్రజ్ఞశ్రీ ఉగాండాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో విద్యను అభ్యసిస్తోంది. అయితే ఆ అమ్మాయికి వివిధ దేశాలు తిరగాలంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఆమె ఆహార ప్రియురాలు. అటు క్రీడల్లోనూ ప్రజ్ఞశ్రీ ప్రతిభను చాటుతోంది. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ వంటి ఔట్ డోర్ గేమ్స్‌తో […]
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందని తన కూతురు బతికుండగానే ఓ తండ్రి శ్రద్ధాంజలి ఘటించాడు. గుండు గీయించుకుని దినకర్మలు చేయించాడు. వివరాల్లోకి వెళ్తే… మద్దూరు గ్రామానికి చెందిన మాధవి అనే యువతి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో తమ ప్రేమను పెద్దల ముందుకు తీసుకువెళ్లారు. అయితే పెద్దలు ససేమిరా అనడంతో ఈనెల 13న గుడిలో పెళ్లి చేసుకున్నారు. […]