ఏపీలో పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నూతన పీఆర్సీ జీవోలను సోమవారం రాత్రి ప్రభుత్వం విడుదల చేయగా అందులోని పలు అంశాలను ఉద్యోగులను కలవరపరిచాయి. ముఖ్యంగా హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 16 శాతానికి తగ్గించడంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పీఆర్సీ తమకు అక్కర్లేదని… పాత పీఆర్సీనే కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్ర […]
టీడీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా నుంచి చంద్రబాబు వేగంగా కోలుకోవాలని… ఆయన ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు చంద్రబాబు స్వయంగా మంగళవారం ఉదయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని […]
ఈనెల 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలను టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు హెచ్చరికలు అందాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ సహా ఇతర దేశాల నుంచి వచ్చే అతిథులపైనా ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ప్రసిద్ధ కట్టడాలు, జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించాయి. డ్రోన్‌ల ద్వారా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని భద్రతా […]
తెలంగాణ వ్యాప్తంగా రోగులకు ప్రిస్కిప్షన్‌పై మందులు రాసే విషయంలో వైద్యులకు రాష్ట్ర వైద్య మండలి కీలక ఆదేశాలను జారీ చేసింది. జనరిక్ మెడిసిన్ పేర్లనే ప్రిస్కిప్షన్‌లలో రాయాలని సూచించింది. ఔషధాల బ్రాండ్ నేమ్ మాత్రం రాయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మెడిసిన్ బ్రాండెడ్ పేర్లకు బదులుగా వాటిలోని కాంపౌండ్ మెడిసిన్‌లనే పేర్కొనాలంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వైద్య మండలి గుర్తుచేసింది. మందుల చీటీల్లో బ్రాండ్ నేమ్ పేర్కొనరాదని ఇటీవల భారతీయ వైద్య మండలి, లోకాయుక్త కూడా […]
ఎన్టీఆర్ 26వ వర్థంతి నాడు టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్థంతి రోజే చంద్రబాబుకు కరోనా సోకడం యాధృచ్ఛికమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబుకు కరోనా సోకడం బాధాకరమని.. ఆయనకు వచ్చిన కరోనా తగ్గిపోతుందేమో కానీ… ఆనాడు ఎన్టీఆర్‌కు బాబు పొడిచిన వెన్నుపోటు తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుంటుందని విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ […]
ఐపీఎల్ 2022లో కొత్తగా రెండు జట్లు రంగప్రవేశం చేయనున్నాయి. వాటిలో ఒకటి అహ్మదాబాద్ జట్టు కాగా మరొకటి లక్నో జట్టు. ఈ రెండు జట్లు ఈనెల 22లోపు తమ జట్టులో ఉండే ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఐపీఎల్ పాలకమండలికి నివేదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ జట్టులో హార్డిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్ ఆడతారని అహ్మదాబాద్ జట్టు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇంకా ఐపీఎల్ మెగా వేలం జరగలేదు. కానీ ముందస్తుగా ఆయా […]
ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నందమూరి కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని ఆమె వెల్లడించారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని… ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారు. ఎన్టీఆర్ ఆత్మ 16ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి […]
తెలుగు దేశం పార్టీకి కరోనా టెన్షన్ పట్టుకుంది. ఆ పార్టీలో సీనియర్ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ముందుగా టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా… ఒక్కరోజు తేడాలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కరోనా వలలో చిక్కుకున్నారు. అంతకుముందు కూడా పలువురు టీడీపీ నేతలు కరోనా బారిన పడ్డా… ఇప్పుడు వరుసగా సీనియర్ నేతలకు కరోనా సోకడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత, […]