దేశంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు బీభత్సమైన రీతిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులపై నిషేధం ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం వెల్లడించింది. Read […]
టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మరో 26 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. Read Also: ఐపీఎల్: అహ్మదాబాద్ కెప్టెన్‌గా […]
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా చిత్ర యూనిట్ ‘పవర్ ఆఫ్ గని’ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో సునీల్ శెట్టి… వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో కోచింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది యోధులుగా తయారవుతారు… కానీ గని యోధుడిగా పుట్టాడు అని ఈ టీజర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. Read Also: క్యాసినో రగడ… ‘జై గుడివాడ’ అంటూ వర్మ […]
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ అరుదైన ఘనత సాధించింది. 2021 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలేలో మూడు టైటిళ్లు గెలుచుకున్న ఏకైక మహిళగా శ్రీకాకుళం జిల్లా వాసి పైడి రజనీ రికార్డులకెక్కింది. గ్రాండ్ ఫినాలేలో జరిగిన క్లాసిక్ కేటగిరిలో మిసెస్ డైనమిక్ టైటిల్, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్, క్రౌన్ ఆంధ్రప్రదేశ్ టైటిళ్లను పైడి రజనీ గెలుచుకుంది. ఈ పోటీల్లో మొత్తం 100 మంది మహిళలు పాల్గొనగా… 38 మంది ఫైనల్స్‌కు అర్హత సాధించారు. […]
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. శశాంక్ గోయల్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న శశాంక్ గోయల్.. కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. గతంలో శశాంక్ గోయల్ కార్మిక, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవలు అందించారు. అంతేకాకుండా […]
సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించారని రెండు రోజులుగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గుడివాడలో క్యాసినో వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. గుడివాడ ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన మంత్రి కొడాలి నానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని… క్యాసినోకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా పూర్వీకులు అని.. వారికేం తెలియదని వర్మ సెటైర్లు […]
దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది. […]
హైదరాబాద్ నగరంలో స్టీల్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వెళ్లే రోడ్డులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. పంజాగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన బ్రిడ్జిని నిర్మించడంతో… శ్మశాన వాటికకు వెళ్లేందుకు ప్రజలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు రోడ్డు విస్తరణ చేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి. Read Also: జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి… ధర్నాకు దిగిన కుటుంబీకులు ఈ బ్రిడ్జి నిర్మాణం […]
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూవారీ కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 18,69,642 టెస్టులు చేయగా… 2,82, 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాటితో పోలిస్తే 44,889 ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 441 మంది మరణించగా… 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉండగా… పాజిటివిటీ రేటు 15.13 […]