విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల భూబి ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్‌పై దాడికి […]
మేషం: లౌక్యంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. శ్రీమతితో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కొనుగోలుదార్లు, సేల్స్ సిబ్బందితో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు, లోన్లు మంజూరవుతాయి. వృషభం: చేతి వృత్తుల వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో మెళుకువ అవసరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబసభ్యులు మసలుకుంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బకాయిల […]
ప్రీపెయిడ్ పేరుతో 28 రోజుల రీఛార్జ్ విధానం అమలు చేస్తూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న టెలికాం సంస్థలకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) షాకిచ్చింది. ఇక నుంచి ప్రీపెయిడ్ కస్టమర్లకు గతంలో లాగా 30 రోజులు చెల్లుబాటయ్యే ప్లాన్లు అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్ 1999కి మార్పు చేస్తూ.. ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కనీసం ఒక ప్లాన్ వోచర్, ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్, ఒక కాంబో […]
కరోనా బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం మొదలుపెట్టింది. కోవిడ్ బాధితులు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కరోనాకు వైద్యం సాయం పొందేలా ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేకంగా ఒక నంబరును కేటాయించింది. కరోనాకు టెలీమెడిసిన్ సాయం కావాలనుకునే వారు 8801033323 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చని ఎన్టీఆర్ ట్రస్ట్ సూచించింది. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వారి మొబైల్ ఫోన్‌కు టెలిమెడిసిన్ సేవలు అందించించే జూమ్ కాల్ […]
✪ తిరుమల: నేడు ఫిబ్రవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… రోజుకు 12వేల టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ✪ విశాఖ: నేడు ఎన్టీఆర్ భవన్‌లో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం… ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.. సమ్మెను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించనున్న కార్మిక […]
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడి స్వల్పంగా కోలుకున్నారు. కానీ ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కొంచెం సేపు వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. దీంతో లతా మంగేష్కర్ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం వైద్యులు గమనిస్తున్నారని పేర్కొన్నారు. Read Also: మెగాస్టార్ చిరంజీవికి […]
కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కౌలు రైతులను ప్రభుత్వం రైతులుగా భావించడం లేదని ఆమె మండిపడ్డారు. కౌలు రైతు బతికి ఉన్నంత వరకు రైతు బీమా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు షర్మిల లేఖ రాశారు. రైతు బీమా విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. కౌలు రైతులను రైతులుగా ఎందుకు చూడరని ఆమె ప్రశ్నించారు. 80వేల పుస్తకాలు చదివి పడేసిన అపర […]
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. చిరంజీవి కరోనా బారిన పడటంతో ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కరోనా నుంచి చిరంజీవి త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కాగా తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని బుధవారం నాడు ట్విటర్ ద్వారా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. తాను హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నట్లు చెప్పారు. Read Also: ‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో గ్లోబల్ రికార్డు […]
గుంటూరు జిల్లాలో ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. సదరు యువకుడు వింతగా గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించాడు. అయితే విద్యుత్ వైర్లు తగిలి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వివరాల్లో వెళ్తే… పిడుగురాళ్లకు చెందిన వీరబ్రహ్మం అనే యువకుడు రైల్వేస్టేషన్‌లో ఉండగా… ప్లాట్‌ఫారంపైకి గూడ్స్ రైలు వచ్చి ఆగింది. వెంటనే వీరబ్రహ్మం గార్డు ఉండే బోగీపైకి ఎక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. Read Also: అద్భుతం: 20 వేల సంవత్సరాలనాటి మమ్మీ కడుపులో […]
ఏపీ ప్రభుత్వం పాలనలో మరో ముందడుగు వేసింది. సచివాలయాల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పోర్టల్ సాయంతో ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పుతాయని సీఎం జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష చేపట్టిన ఆయన పోర్టల్ ఏర్పాటుతో ప్రజలు స్వయంగా తమ అప్లికేషన్ స్టేటస్‌ను […]