అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమూల్ సంస్థతో రెండు ఒప్పందాలపై సీఎం జగన్ సంతకాలు చేశారు. బాలమృతం, అంగన్‌వాడీ పిల్లలకు పాల సరఫరాపై అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… పాలు పోస్తున్న మహిళలే అమూల్‌కు యజమానులు అని వెల్లడించారు. ప్రైవేట్ డైరీల కన్నా ఎక్కువ రేటు ఇచ్చి అమూల్ సంస్థ పాలు […]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… చండ్రుగొండ మండలంలోని సుజాతనగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డిపల్లి మండలానికి వరినారు తీసేందుకు బొలెరో వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. అయితే తిప్పనపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా బొగ్గు లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. Read […]
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారాంతపు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అటు ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది. పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. Read Also: తెలంగాణలో భూములకు కొత్త మార్కెట్ […]
తిరుమల ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. ప్రతిరోజూ 12వేల టిక్కెట్లు చొప్పున రూ.300 దర్శనం టిక్కెట్లను టీటీడీ అందుబాటులో ఉంచగా.. అన్నీ టిక్కెట్లు 40 నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోయాయి. చాలా మంది భక్తులకు టిక్కెట్లు దొరక్కపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల కాగా మరోవైపు ఫిబ్రవరి […]
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం, జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ఆయన విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం… జిల్లా కేంద్రాలను మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని నిలదీశారు. Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ […]
క్రికెట్‌లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్ పోటీలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్‌లో గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రాణించడంతో 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 130 పరుగులకే పరిమితమైంది. Read Also: ప్రతి జట్టులో ధోనీ లాంటోడు ఉండాలి.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రశంసలు ఈ మ్యాచ్‌లో […]
తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువ సవరణను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ విలువ 25-30 శాతం పెంచుతూ రిజిస్ట్రేషన్‌ల శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మార్కెట్ విలువకు సవరించిన విలువకు మధ్య సరాసరి వ్యత్యాసం 35-40 శాతం ఉండనున్నట్లు సమాచారం. Read Also: నిరుపేదలకు శుభవార్త.. ప్రారంభానికి సిద్ధమవుతున్న సర్కారు ఇళ్లు మరోవైపు […]
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూం హౌసింగ్ ప్రాజెక్టు హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో పూర్తయింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రూ.1,422.15 కోట్లతో ప్రభుత్వం 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. ఇందులో 115 బ్లాకులు, 234 లిఫ్టులు ఉన్నాయి. అలాగే ప్లే స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు, బస్ టెర్మినల్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంకులు, బస్తీ దవాఖానాలు, ఏటీఎంలు, బ్యాంకులు, సైక్లింగ్ ట్రాక్స్ […]
ఏపీలో జిల్లాల విభజనపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడంపై ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి స్వాగతించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా స్పందించారు. 2019 నుంచి జగన్ పాలనలో 100 పనులు చేస్తే అందులో 99 సుద్ద తప్పులు ఉన్నాయని… ఆ తప్పులతో జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రతి తప్పుకి ప్రజలను డైవర్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి […]
ఆర్టీసీ ప్రయాణీలకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త అందించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఎస్ నుంచి మహత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఉచితంగా ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు అందుబాటులో ఉంటాయని… ప్రయాణికులు ఈ వాహనాలలో ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన సూచించారు. Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్ […]