ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విభజిస్తూ 26 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లలో తేడాలు కనిపించాయి. కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు రాజమండ్రి జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. అయితే ప్రభుత్వం విడుదల […]
కరోనా మహమ్మారి ఇప్పటికే దేశంలో లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్న మానసిక వేదనతో హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. Read Also: యువకుడికి సైబర్ నేరగాళ్ళ షాక్.. ఏం జరిగిందంటే? వివరాల్లోకి వెళ్తే… భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్‌లో […]
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఆల్‌రౌండర్ జడేజా ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడని.. అందుకే అతడిని సెలక్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ సిరీస్‌లకు బుమ్రా, షమీలకు విశ్రాంతి ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి ఫిట్‌గా లేని కారణంగా హార్డిక్ […]
✪ ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నేటి నుంచి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు… ఈనెల 30 వరకు కొనసాగనున్న ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు✪ ఏపీలో స్కూళ్ల నిర్వహణపై నేడు అధికారుల కీలక సమావేశం… పాఠశాలల మ్యాపింగ్‌పై ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమం… బడుల నిర్వహణ, టీచర్ల సర్దుబాటుపై నిర్ణయం✪ ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు✪ నేటి నుంచి కార్వీ ఎండీ పార్థసారథిని […]
బీహార్‌లో ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో వేలాదిమంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు గయాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గయాలో ఓ రైలుకు ఆందోళనకారులు నిప్పు అంటించారు. సీబీటీ 2 పరీక్ష తేదీని నోటిఫై చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీటీ 2 పరీక్షను […]
ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో అవినీతి నిర్మూలనలో పెద్దగా మార్పు కనిపించలేదని ‘ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. కరోనా కట్టడి చర్యల కారణంగా గత రెండేళ్లుగా అవినీతి నియంత్రణ చర్యలకు ఆటంకం కలుగుతోందని సదరు సంస్థ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అవినీతి రహిత (అవినీతి లేకపోవడం) దేశాల ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 85వ ర్యాంకులో నిలిచింది. దాయాది దేశం పాకిస్థాన్‌లో భారత్‌లో కంటే ఎక్కువ అవినీతి ఉందని సర్వే […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాకుండా తప్పుచేశారని… ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆరోపించారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కనీసం సీనియర్ మంత్రి కూడా లేకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని ఈటల అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వాదులు బాధపడే సంఘటన అని అభివర్ణించారు. Read Also: 33 […]
దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైన టీమిండియా టెస్ట్ ఆటగాళ్లు పుజారా, రహానెలు జట్టులో స్థానానికే ఎసరు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో డిమోషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు గ్రేడ్-ఏలో ఉన్న పుజారా, రహానెలను గ్రేడ్-బి కాంట్రాక్ట్‌కు బీసీసీఐ డిమోషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు మాత్రమే కొనసాగనుంది. ఈ క్రమంలో 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు కాంట్రాక్టులను బీసీసీఐ సిద్ధం చేస్తోంది. త్వరలోనే […]
దక్షిణాఫ్రికా గడ్డపై వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియా.. త్వరలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్.. ప్రస్తుతం పూర్తి కోలుకుని ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. రోహిత్ బుధవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే సెలక్షన్ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఈరోజు జాబితా విడుదల చేశారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అంతేకాకుండా ఈ జాబితాలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ ఛైర్మన్‌లు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. జిల్లాల వారీగా టీఆర్ఎస్ అధ్యక్షుల జాబితా: ఆదిలాబాద్: జోగురామన్న, ఆసిఫాబాద్: కోనప్ప, మంచిర్యాల: బాల్కసుమన్, నిర్మల్: విఠల్ రెడ్డి, నిజామాబాద్: జీవన్ రెడ్డి, కామారెడ్డి: ముజీబుద్దీన్, కరీంనగర్: రామకృష్ణారావు, […]