గుంటూరు జిల్లాలో ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. సదరు యువకుడు వింతగా గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించాడు. అయితే విద్యుత్ వైర్లు తగిలి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వివరాల్లో వెళ్తే… పిడుగురాళ్లకు చెందిన వీరబ్రహ్మం అనే యువకుడు రైల్వేస్టేషన్‌లో ఉండగా… ప్లాట్‌ఫారంపైకి గూడ్స్ రైలు వచ్చి ఆగింది. వెంటనే వీరబ్రహ్మం గార్డు ఉండే బోగీపైకి ఎక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు.
Read Also: అద్భుతం: 20 వేల సంవత్సరాలనాటి మమ్మీ కడుపులో
ఈ క్రమంలో వీరబ్రహ్మం ఓ చెయ్యి పైకెత్తగా అది హైటెన్షన్ కరెంట్ తీగకు తగిలింది. కాలుతున్న శరీరంతోనే రైలు పైనుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పి యువకుడి దుస్తులు తొలగించారు. అనంతరం రైల్వే పోలీసులు బాధితుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరబ్రహ్మం పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.