పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్ సీఎం అభ్యర్థిని లుథియానా వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. అయితే సీఎం అభ్యర్థి అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నవజ్యోత్ సిద్దూకు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపించింది. అధిష్టానం ఎప్పుడూ కూడా బలహీన సీఎంలనే కోరుకుంటుందని ఇటీవల సిద్దూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. […]
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటి భీమిరెడ్డి శ్రీసుధతో గతంలో అతడు సహజీవనం చేయగా ఆ వ్యవహారం వివాదాస్పదమైంది. తనతో శ్యామ్ కె నాయుడు పెళ్లి పేరుతో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని శ్రీసుధ హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా, శ్యామ్ కె నాయుడుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. Read Also: లతా […]
దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలను సడలించింది. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ఇంటింటి ప్రచారాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులపై గతంలో విధించిన నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. Read Also: భారత్‌లో మరో కొత్త కల్చర్… ఇకపై వారానికొకసారి ఎన్నికల ప్రచారంలో […]
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. బుమ్రా, షమీ లాంటి ఫ్రంట్ లైన్ బౌలర్లు లేకపోయినా వెస్టిండీస్‌ను 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా ముందు 177 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్లుగానే భారత బౌలర్లు వెస్టిండీస్‌ను బెంబేలెత్తించారు. హోల్డర్ (57) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి అలెన్ (29) నుంచి సహకారం […]
తెలంగాణ 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల లోపు టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు హన్మకొండలో 103 శాతం మేర వ్యాక్సినేషన్ జరగ్గా… రంగారెడ్డి జిల్లా 51 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మంది 15 నుంచి 17 ఏళ్ల లోపువారుండగా.. కేవలం 90,046 మందికే ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ వేశారు. అటు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కవరేజీ 70 శాతం లోపే ఉంది. Read […]
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా నివాసంలో విషాదం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఆదివారం ఘాజియాబాద్‌లోని స్వగృహంలో మరణించారు. కొన్నిరోజులుగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. త్రిలోక్ చంద్ గతంలో మిలటరీ అధికారిగా పనిచేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో ఆయన దిట్ట. ఆయన పూర్వీకులది జమ్ముకాశ్మీర్‌లోని రైనావరి గ్రామం. 1990లలో కశ్మీరీ పండిట్ల హత్యల ఘటన అనంతరం ఆ గ్రామాన్ని విడిచిపెట్టారు. అనంతరం యూపీలోని మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు. Read Also: లతా మంగేష్కర్‌కు […]
గాన కోకిల, ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌కు టీమ్‌ఇండియా ఆటగాళ్లు నివాళి అర్పించారు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో క్రికెటర్లు తమ భుజాలకు నల్ల బ్యాడ్జీలు ధరించారు. లతా మంగేష్కర్ మరణించారనే వార్త తెలుసుకుని ఆట ఆరంభానికి ముందు ఆటగాళ్లు ఆమెకు నివాళి అర్పించారు. ఈ మేరకు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. Read Also: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్ దంపతులు కాగా టీమిండియా ఓవరాల్‌గా […]
ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రుల కమిటీతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మెను విరమించారు. అంతకుముందు ఉద్యోగ సంఘాల నేతలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో సీఎం జగన్ మనసు విప్పి మాట్లాడారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని సీఎం జగన్ కోరారు. తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని.. ఉద్యోగులు లేకపోతే తాను లేనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి […]
కొందరికి మొబైల్ చేతిలో ఉంటే చాలు… వేరే లోకం అవసరం లేదు. మొబైల్ చూస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలకు గురయ్యేవారు చాలా మందే ఉన్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. మొబైల్ ఫోన్ చూడటంలో పూర్తిగా బిజీ అయిన ఒక వ్యక్తి మెట్రో రైల్ పట్టాలపై పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… ఈశాన్య ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల శైలేందర్ మెహతా శుక్రవారం మరో చోటకు వెళ్లేందుకు షాహదారా మెట్రో స్టేషన్‌కు […]
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. #ShameOnYouKCR పేరుతో బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే… #EqualityforTelangana పేరుతో టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయంటే.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వార్ ఏ రేంజ్‌లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పట్ల […]