ఏపీలో ఎట్టకేలకు పీఆర్సీ చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి రెండు దఫాలుగా మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. నిన్న, ఈరోజు రెండు రోజుల పాటు సుమారు 10 గంటల పాటు స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశం సాగింది. ఉద్యోగ సంఘాల ప్రధాన అంశాలు హెచ్‌ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, రికవరీ రద్దు, ఐదేళ్ల పీఆర్సీపై ప్రభుత్వం సానుకూలంగా చర్చించినట్లు తెలుస్తోంది. Read Also: ఫిట్‌మెంట్‌పై కీలక ప్రకటన చేసిన […]
ఏపీలో ఎస్మా ప్రయోగంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓ వైపు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఏపీ మైనింగ్ శాఖ ఎస్మా ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చర్చల ప్రక్రియ మళ్లీ ప్రారంభమైందని అందరూ భావిస్తున్న తరుణంలో మైనింగ్ శాఖ ఎస్మా నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. చర్చలు జరుగుతున్న సమయంలో ఎస్మా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. Read Also: బాలయ్యకు వైసీపీ […]
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని శ్రీరామనగరంలో సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందని… తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని కొనియాడారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలుగు భాషా చరిత్ర ఎంతో సుసంపన్నమైందని కీర్తించారు. కాగా […]
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంపై తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. దేశ ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ జ్వరం అని చెప్తూ తప్పించుకోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. అనుకున్న విధంగానే జరిగిందని.. గతంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన చంద్రబాబు, పంజాబ్ సీఎం చన్నీ అడుగు జాడల్లో కేసీఆర్ నడుస్తున్నారని ఎద్దేవా చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం […]
ఏపీలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేసేందుకు ఓకే చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాత కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తామని తెలిపింది. పెండింగ్ అంశాలను అభ్యంతరాల కమిటీకి పంపుతామని పేర్కొంది. Read Also: అసలు ఎస్మా అంటే ఏంటి? ప్రభుత్వం ఎందుకు ప్రయోగిస్తుంది? కాగా మరోవైపు మంత్రుల […]
హైదరాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తిరునామం పెట్టుకుని పట్టువస్త్రాలను నరేంద్ర మోదీ కట్టుకున్నారు. సంప్రదాయ వస్త్రాలలో యాగశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమతా మూర్తి విగ్రహం బరువు 1800 కిలోలు కాగా.. గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న రెండో […]
వెస్టిండీస్ ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ వేదికగా కాసేపట్లో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. టైటిల్ కోసం ఇంగ్లండ్, భారత్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో యువ భారత్‌కు ఇది 8వ ఫైనల్ కావడం విశేషం. గతంలో ఏడు సార్లు ఫైనల్ ఆడిన భారత్… నాలుగుసార్లు విజేతగా నిలిచింది. మరో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచింది. Read Also: పోరాడండి.. ట్రోఫీ గెలవండి: భారత కుర్రాళ్లకు […]
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తుందన్న వార్తల నేపథ్యంలో అసలు ఎస్మా అంటే ఏంటో తెలియక చాలా మంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటే అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎస్మా అంటారు. సమ్మెలు, బంద్‌ల వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడటం, కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ ఆటంకం లేకుండా కొనసాగేలా చూడటం కోసం 1981లో ఈ చట్టం రూపొందించారు. Read Also: ఉద్యోగులకు షాక్.. […]
ఏపీలో పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓ వైపు ఉద్యోగులతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఏపీలోని గనుల శాఖలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గనుల శాఖలో ఎవరైనా ఉద్యోగులు సమ్మెకు వెళ్లినా.. బంద్ చేసినా.. ఆందోళనలకు దిగినా ఎస్మా చట్టం ప్రకారం […]