కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయాల విధులకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. అయితే సోమవారం నుంచి అన్నిశాఖలకు చెందిన వారు కార్యాలయాల్లో విధులకు హాజరు కావాలని కేంద్రం పేర్కొంది. Read Also: వైరల్: ఇండియాలో తొలి బ్లాక్ చెయిన్ వివాహం కాగా […]
అండర్-19 టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. అతడి నేతృత్వంలోని యువ భారత్ ఇంగ్లండ్‌ను ప్రపంచకప్ ఫైనల్లో మట్టికరిపించి ఐదోసారి వరల్డ్ ఛాంపియన్‌లుగా నిలిచింది. ఈ సందర్భంగా ఐసీసీ యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో విన్నింగ్ కెప్టెన్‌గా నిలిచిన యష్ ధుల్‌ను ఐసీసీ అప్‌స్టోక్స్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. Read Also: చారిత్రక వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం అండర్-19 […]
చూస్తుండగానే… ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ నాలుగో ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఈసారి యంగ్ అండ్ పాపులర్ సింగర్స్ కృష్ణ చైతన్య, దీపు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ టైమ్ మేల్ సింగర్స్ వచ్చిన ఈ షోను సాకేత్ ఫుల్ ఆన్ ఎనర్జీతో డబుల్ ఎంటర్ టైన్ మెంట్ తో నిర్వహించాడు. ప్రస్తుతం కుర్రకారు పెదాలపై నాట్యం చేస్తున్న ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ తో షోను ప్రారంభించాడు. రామ్ మిరియాల […]
ఏపీ సీఎం జగన్ సోమవారం నాడు హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ మధ్యాహ్నం 3:50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ […]
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో అభిమానుల కన్నీటి నివాళుల మధ్య లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై అభిమాన గాయని పార్థివ దేహానికి కడసారిగా నివాళులర్పించారు. విషాదంలో ఉన్న లతా మంగేష్కర్ కుటుంబీకులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆమె నివాసం నుంచి మొదలైన లతా మంగేష్కర్ అంతిమయాత్రకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. […]
ఏపీలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పెళ్లికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరినట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. కాగా ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను […]
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ దుమ్మురేపింది. 177 పరుగుల విజయలక్ష్యాన్ని 28 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియాకు వన్డేల్లో ఇది 1000వ వన్డే కావడంతో ఈ మ్యాచ్‌ను మరపురాని జ్ఞాపకంగా మార్చుకుంది. Read Also: మాజీ క్రికెటర్ సురేష్ రైనా నివాసంలో విషాదం ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా వెస్టిండీస్ […]
ఏపీలో గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలకు బాలయోగి పేరును తొలగించడం తీవ్ర అభ్యంతరకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును వైసీపీ ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. అంబేద్కర్ పేరునే పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. జగన్, వైఎస్ఆర్ పేరుతో కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టవచ్చని సూచించారు. Read Also: ఆందోళనలు కొనసాగిస్తాం.. స్పష్టం […]
ఏపీలో పీఆర్సీ అంశం ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని ముగించడం పట్ల కొన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు జేఏసీ స్టీరింగ్ కమిటీ అంగీకరించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి ఏం చర్చించిందో అర్థం కావడం లేదని.. అశుతోష్ మిశ్రా రిపోర్టు చూపించలేదని, నూతన పీఆర్సీ జీవోలు రద్దు చేయలేదని ఏపీటీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. Read […]
టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. తాను ప్రజల మధ్యే ఉంటానని… ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా స్పష్టం చేశారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… తాను అక్రమంగా సంపాదిస్తున్నారని మాట్లాడితే.. మూతి పగిలిపోతుందని గాలి భానును ఉద్దేశించి హెచ్చరించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ బహిర్గతం చేస్తానని.. వైసీపీలో ఉన్నవారి అండదండలతో తనపై గెలవాలనుకుంటే పగటి కలే […]