Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌కు మరో సీనియర్ నటుడు దూరమయ్యారు. ముత్యాల ముగ్గు ఫేం నటుడు పి.వెంకటేశ్వరరావు (90) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈరోజు ఆయన కన్నుమూశారు. రంగస్థల కళాకారుడిగా పలు నాటకాల్లో నటించిన వెంకటేశ్వరరావు 1965లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన తేనెమనసులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఏడాదిలోనే మళ్లీ కృష్ణ నటించిన కన్నె మనసులు చిత్రంలో నటించారు.
అయితే 1975లో లెజెండ్రీ డైరెక్టర్ బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ముత్యాల ముగ్గు చిత్రంలో పూజారి పాత్రలో వెంకటేశ్వరరావు నటించి అందరి ప్రశంసలు పొందారు. ఈ సినిమాతో ఆయన ముత్యాల ముగ్గు వెంకటేశ్వరరావుగా మారిపోయారు. ముత్యాల ముగ్గుతో పాటు ఆత్మీయులు, మట్టిలో మాణిక్యం, సుడిగుండాలు లాంటి చిత్రాల్లో కూడా వెంకటేశ్వరరావు నటించారు. గతంలో ఇదేమిటి అనే నాటకంలో నటించి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు అందుకున్నారు. ఆయన సతీమణి లక్ష్మీ. వీరి దంపతులకు ఏడుగురు పిల్లలు సంతానం.
Also Read
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!