IPL 2022: బీసీసీఐకి ఎదురుదెబ్బ.. భారీగా తగ్గిన ఐపీఎల్ వీక్షకుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ ప్రసార మ్యాచ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ మేరకు 2023-2027 నాలుగేళ్ల కాలానికి ప్రసార హక్కుల కోసం బీసీసీఐ త్వరలో టెండర్లను పిలవనుంది. అయితే ఈ టెండర్లు పిలవకముందే బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ వీక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు రిపోర్టులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే తొలివారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్ నివేదిక ప్రకారం గత ఏడాది తొలి 8 మ్యాచ్‌లకు 3.75 టీవీ రేటింగ్ లభించగా.. ఈసారి ఆ సంఖ్య 2.52కే పరిమితమైంది. 2020లో తొలి వారం మ్యాచ్‌లకు 3.85 టీవీ రేటింగ్ వచ్చింది.
2023 – 2027 ప్రసార హక్కులకు భారీ మొత్తం బిడ్డింగ్ వస్తుందని ఆశిస్తున్న బీసీసీఐకి ఈ అంశం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు డిస్నీ స్టార్, టీవీ 18-వయాకామ్, అమెజాన్, సోనీ సంస్థలు టెండర్ పత్రాలను కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐకి వ్యూయర్స్ సమస్య పట్టుకుంది. అయితే ఈ ఏడాది జట్ల సంఖ్య పెరగడం, ఆటగాళ్లు ఒక టీమ్ నుంచి మరో టీమ్‌కు మారిపోవడం గందరగోళం రేపింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలన్న ఆసక్తి కలగడం లేదని కొందరు క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. అందులోనూ తమ అభిమాన ఆటగాళ్లు ధోనీ, కోహ్లీ కెప్టెన్‌గా కూడా లేకపోవడం కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా 33 శాతం వీక్షకుల సంఖ్య తగ్గిపోవడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
https://ntvtelugu.com/today-ipl-matches-schedule-in-ipl-2022/
- Tags
- bcci
- Hotstar
- ipl 2022
- ratings
- viewership
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!