ఆ జంటకు కొత్త వివాహమైంది. దీంతో పెద్దలు వాళ్లిద్దరికీ తొలిరాత్రి ఏర్పాటు చేశారు. అయితే ఆనందాన్ని పంచాల్సిన తొలిరాత్రి ఆ జంట మధ్య విడాకులకు కారణమైంది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… తమకు కొత్తగా పెళ్లికావడంతో వధూవరులు తొలిరాత్రి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తమ జీవితాల్లో జరిగిన ఘటనల గురించి ఒకరికొకరు వివరించుకున్నారు. ఈ క్రమంలో వధువు చెప్పిన ఓ చేదు నిజం విని వరుడు అవాక్కయ్యాడు.
గతంలో తనపై మేనమామ కుమారుడు అత్యాచారం చేసినట్లు వధువు వెల్లడించడంతో వరుడు షాకయ్యాడు. దీంతో మరుసటి రోజే తన భార్యను పుట్టింట్లో వదిలిపెట్టేశాడు. బంధువులకు కూడా అప్పుడే అసలు నిజం తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ వివాహాన్ని రద్దు చేయాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ కేసులో ఎన్నిసార్లు నోటీసులు పంపినా భార్య కోర్టుకు హాజరుకాలేదు. ఇలా మూడేళ్ల పాటు సాగిన విచారణను ఇటీవల కోర్టు ముగిస్తూ తీర్పు వెల్లడించింది. యువకుడు కోరిన విధంగా 2019లో జరిగిన వారి వివాహాన్ని కోర్టు రద్దు చేసింది.
https://ntvtelugu.com/spacex-launches-first-time-all-private-crew-to-space-station/