మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య తెచ్చిన టిఫిన్‌లో ఉప్పు ఎక్కువగా ఉందనే కారణంతో ఓ భర్త ఆమె గొంతునులిమి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే… నిఖేష్ అనే 46 ఏళ్ల వ్యక్తి దహిసర్ ఈస్ట్ అనే ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో బ్యాంక్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నిర్మల అనే 40 ఏళ్ల భార్య ఉంది. వీరి దంపతులకు 12 ఏళ్ల కుమారుడు చిన్మయి కూడా ఉన్నాడు.
అయితే శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిర్మల తన భర్తకు టిఫిన్‌గా కిచిడీ వండి భర్తకు పెడదామని అతడి బెడ్‌రూంకు వెళ్లింది. అయితే కిచిడీలో ఉప్పు ఎక్కువైందని నిఖేష్ తన భార్యను కొట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిఖేష్ తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ హత్యను కళ్లారా చూసిన 12 ఏళ్ల కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.