వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. అయితే మండు వేసవిలో ఓ గ్లాస్ చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల శరీరం ఉత్తేజితం అవుతుంది. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలు మనకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. చెరుకులో పిండి పదార్థాలు, మాంసకృతులతో పాటు ఐరన్, జింక్, పొటాషియం, పాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా దాగి ఉన్నాయి. విటమిన్ ఎ, బి, సి కూడా శరీరానికి లభిస్తాయి.
వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
★ అలసట, నిస్సత్తువను తగ్గించి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
★ మలబద్ధకాన్ని పారదోలుతుంది
★ క్రమం తప్పకుండా చెరుకు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
★ చెరుకు రసంలోని ఫ్లెవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ఫెనోలిక్ సమ్మేళనాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి
★ చెరుకు రసంలోని ఖనిజాలు దంతాలు, ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి
★ నోటి దుర్వాసనను తగ్గించి దంత సమస్యలను నివారిస్తుంది
★ శరీరంలో ప్రొటీన్ స్థాయిలను పెంచుతుంది
★ మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది