దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,927 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం 2,483 కేసులు నమోదు కాగా బుధవారం కేసుల సంఖ్య 2,927కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,65,496కి చేరింది. మరోవైపు కొత్తగా 32 మంది కరోనాతో మరణించారు.
గడిచిన 24 గంటల్లో 2,252 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,25,25,563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,279 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో 0.04 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.22 శాతంగా నమోదైంది. కేసులు పెరుగుతున్న కారణంగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 21,97,082 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వగా.. ఇప్పటివరకు 1,88,19,40,971 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది.
Covid Vaccination: దేశంలో 86 శాతం మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తి