డార్లింగ్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ ‘ది రాజాసాబ్’. 2026 సంక్రాంతికి ఈ సినిమా సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ప్రారంభించగా.. తాజాగా జరిగిన ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రభాస్‌తో కలిసి నటించిన అనుభవాలను పంచుకుంటూ కొన్ని ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన.
Also Read :Prakash Raj :‘సినిమాలు చూడకండి’ అంటూ.. ప్రేక్షకులపై ప్రకాష్ రాజ్ సెటైర్లు
నిధి మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌తో పనిచేయడం నా కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయి.. ఆయన పక్కన నటించేటప్పుడు ఎదుర్కొన్న ఒక చిన్న ‘ఇబ్బంది’ అంటే ప్రభాస్ ఆరు అడుగులకు పైగా ఎత్తు ఉండటంతో, ఆయనకు సరితూగడానికి నేను షూటింగ్‌లో ‘ఆపిల్ బాక్స్’ (ఎత్తు పెంచే స్టాండ్) వాడాల్సి వచ్చింది. కెరీర్‌లో తొలిసారి నా హైట్ విషయంలో చాలా ఫీల్ అయ్యా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డ. కానీ ప్రభాస్ చాలా సపోర్టివ్ నను ఎంతో కంఫర్ట్‌గా ఉంచారు. గ్రీస్‌లో జరిగిన సాంగ్ షూటింగ్ బయట ఫుడ్ కాకుండా, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు తానే స్వయంగా వండుకుని తిన్నాను. అంతేకాకుండా ఈ సినిమాతో మరో సాహసం చేశా.. నా కెరీర్‌లో మొదటిసారి తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నా. ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా, ఇది నా కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్న’ అని తెలిపింది.
ఇక మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కూడా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ట్రైలర్ ఇప్పటికే దుమ్ములేపుతుండటంతో, సంక్రాంతికి ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.