Andhra Pradesh Schools: ఏపీలో స్కూల్ విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు శుభవార్త అందించారు. ఆగస్టు 27న శనివారం నాడు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రెండో శనివారమైన ఆగస్టు 13న విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు వచ్చిన నేపథ్యంలో.. ఆగస్టు 13కు బదులుగా ఆగస్టు 27ను సెలవుదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13న అన్ని స్కూళ్లు పనిచేశాయి. అందువల్ల ఆగస్టు 13 సెలవునకు ప్రత్యామ్నాయంగా ఆగస్టు 27న సెలవుగా పరిగణించాలని విద్యాశాఖ కమిషనర్ కె.సురేష్ కుమార్ సర్క్యులర్ విడుదల చేశారు.
Read Also: Child Trafficking Gang: ఏపీలో కలకలం రేపుతున్న చంటిబిడ్డల విక్రయం
కాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఏపీలోని అన్ని స్కూళ్లలో డ్యాన్స్, మ్యూజిక్, ర్యాలీలు, పెయింటింగ్, గ్రూప్ డిస్కషన్స్, జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి అప్‌లోడ్ చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. అందుకే ఆగస్టు 13ని వర్కింగ్ డేగా విద్యాశాఖ పేర్కొంది. ఇప్పుడు దానికి బదులుగా ఆగస్టు 27న సెలవు దినంగా ప్రకటించింది. విద్యార్థులు, టీచర్లు ఈ విషయాన్ని గమనించాలని సర్క్యులర్‌లో విద్యాశాఖ పేర్కొంది.