New Super Earth: అతి పెద్దదైన భూమి.. అక్కడ ఏడాది అంటే 11 రోజులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Super Earth: ఈ విశ్వంలో భూమికి మించిన పెద్ద జీవగ్రహం ఉందా అంటే కచ్చితంగా లేదనే సమాధానం వినిపిస్తుంది. అయితే కొన్నాళ్లుగా భూమిపై నివసించే జనాభా పెరిగిపోతుండటంతో మరో గ్రహంపై నివసించేందుకు గల అవకాశాలను సైంటిస్టులు పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ మేరకు సౌరవ్యవస్థ వెలుపల గ్రహాల కోసం వెతుకుతున్న ఖగోళ శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేసేలా చాలా లోతైన సముద్రాన్ని కలిగి ఉండే గ్రహం కనుగొనబడింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది భూమిని పోలిన గ్రహం. సౌరవ్యవస్థకు ఆవల కనిపించిన ఈ భూమి మన భూమి కంటే 70 రెట్లు పెద్దది. అంతేకాకుండా మన భూమి కంటే ఐదు రెట్లు బరువైనది. ఈ గ్రహంపై సంవత్సర కాలం అంటే 11 రోజులు మాత్రమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ గ్రహంపై రెండు సూర్యుళ్లు ఉంటారు. ఒకదాని చుట్టూ భ్రమణాన్ని 11 రోజుల్లో పూర్తి చేస్తుండగా మరోదాని చుట్టూ తిరిగేందుకు 1400 సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Read Also: Tallest Buildings: ప్రపంచంలో అత్యధిక ఎత్తైన భవనాలు ఉన్న నగరం ఇదే
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
కెనడాకు చెందిన మాంట్రియల్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ఈ భూమిని కనుగొంది. సూపర్ ఎర్త్ అని ఈ గ్రహానికి సైంటిస్టులు నామకరణం చేశారు. ఈ మేరకు టీవోఐ-1452బి అని పేరు పెట్టారు. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఈఎస్ఎస్), భూ ఆధారిత టెలిస్కోప్‌ల పరిశీలన సమయంలో ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సూపర్ ఎర్త్‌పై హైడ్రోజన్, హీలియంతో కూడిన రాతి గ్రహం అయి ఉండొచ్చని, దీనిపై వాతావరణం తక్కువగా, లేదంటే అసలు ఉండకపోవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహం మొత్తం ద్రవ్యరాశిలో 30 శాతం వరకు సముద్ర ప్రపంచం ఉన్నట్లు అనుకరణలు చూపిస్తున్నాయి. ఈ భూమితో పోల్చి చూస్తే మన భూమిపై ఉన్న 70 శాతం నీటి ప్రాంతాలు మొత్తం ద్రవ్యరాశిలో కేవలం 1 శాతం మాత్రమే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ అతిపెద్ద భూమి మనకు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే మన లాంటి భూమి మరోటి ఉందని మురిసిపోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఒక కాంతి సంవత్సరమంటే.. దాదాపు 9 లక్షల 50 వేల కోట్ల కిలోమీటర్లు. ఈ లెక్కన 100 కాంతి సంవత్సరాలు అంటే ఎంత దూరంలో ఉందో ఊహిస్తేనే కష్టంగా ఉంది.
తాజావార్తలు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?