Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి డిలీట్ సీన్.. మీరూ ఓ లుక్కేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjun Reddy Delete Scene: యంగ్ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తెచ్చిపెట్టిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. 2017, ఆగస్టు 25న విడుదలైన ఈ మూవీ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినీ అభిమానులకు ట్రీట్ అందించింది. 2.53 నిమిషాల నిడివి ఉన్న డిలీట్ సీన్‌ను తాజాగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా నుంచి వచ్చిన ఈ డిలీట్ సీన్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సీన్‌లో విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ మధ్య సంభాషణలను చూపించారు. హీరోయిన్ షాలినీ పాండే కోసం హీరో ఆమె ఇంటికి వెళ్లి ముద్దు పెట్టుకోవడం.. అది చూసి హీరోయిన్ వాళ్ల నాన్న హీరోతో గొడవపడిన ఘటనపై ఇద్దరి మధ్య చర్చ సాగింది. ప్రీతి(షాలినీ పాండే)ని ప్రేమతో ముద్దు పెట్టుకుంటే వాళ్ల నాన్న తప్పుగా అర్థం చేసుకున్నాడని విజయ్ దేవరకొండ తన స్నేహితుడి వద్ద ఆవేదన వ్యక్తం చేయడాన్ని ఈ సీన్‌లో చూడొచ్చు.
Read Also: International Dogs Day: ప్రతి కుక్కకు ఓ రోజు.. ఆ రోజు ఈ రోజే..!!
Also Read
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
రొమాంటిక్ బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఈ మూవీకి అప్పట్లో సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించారు. ఈ సన్నివేశాలను ఇప్పుడు డిలీట్ సీన్‌లుగా చిత్ర యూనిట్ అందించే పనిలో పడింది. ఈ మేరకు తొలి డిలీట్ సీన్‌ను గురువారం రాత్రి అప్‌లోడ్ చేశారు. కాగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన షాలినీపాండే హీరోయిన్‌గా నటించింది. వీళ్లిద్దరికీ ఈ మూవీ మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాతే షాలినీపాండేకు అవకాశాలు వరుస కట్టాయి. ఈ మేరకు ఆమె గురువారం నాడు ఓ ట్వీట్ చేసింది. ‘ఐదేళ్ల క్రితం ఇదే రోజు నా మొదటి సినిమా అర్జున్ రెడ్డి విడుదలైంది. ఈ సినిమా నా మరపురాని క్షణాల్లో ఒకటిగా నిలిచింది. అర్జున్ రెడ్డిలో ప్రీతి పాత్రపై నాకు లభించిన ప్రేమ, ప్రశంసలు అపూర్వమైనవి. అందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. అర్జున్ రెడ్డికి నేను రుణపడి ఉంటాను’ అంటూ షాలినీ పాండే పోస్ట్ పెట్టింది.
5 years for ARJUN REDDY 🙂
Very happy to share this scene 🙏
Thanks to the entire cast & crew🙏@TheDeverakonda #ShaliniPandey @eyrahul @VangaPranay @VangaPictures @rameemusic @Synccinema#5yearsforarjunreddy
https://t.co/3qiQhM3YvW— Sandeep Reddy Vanga (@imvangasandeep) August 25, 2022
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!