Dangerous Reporting: నెటిజన్‌ల ప్రశంసలు.. ఇలాంటి రిపోర్టింగ్ మీరెప్పుడైనా చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video Of Live Reporting: మీడియా రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా రంగంలో చాలా మంది జర్నలిస్టులు ఎన్నో సందర్భాల్లో సాహసాలు సైతం చేస్తుంటారు. తాజాగా పాకిస్తాన్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటిలో చిక్కుకున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ పీకల్లోతు నీటిలో వరదలో నిలబడి మరీ లైవ్ కవరేజ్ ఇచ్చాడు. వరదలో కొట్టుకుపోతుండగా అతనితో పాటు కెమెరామెన్ వీడియో తీస్తూ అనుసరించాడు. ఆ ప్రాంత పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు సదరు రిపోర్టర్ ప్రాణాలకు తెగించి తన వంతు కృషి చేశాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి రిపోర్టింగ్ గతంలో ఎప్పుడూ చూడలేదంటూ కొనియాడుతున్నారు. అయితే సదరు జర్నలిస్టు డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అని కొందరు నెటిజన్‌లు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం టీఆర్పీ కోసం మీడియా సంస్థలు జర్నలిస్టుల చేత ఇలాంటి రిపోర్టింగ్ చేయించడం సబబు కాదని మండిపడుతున్నారు.
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్గా మార్చే సింపుల్ టిప్స్.!
Dangerous,deadly,killer #Pakistani #Reporting..
There is #FloodinPakistan and news channels,army and #ImranKhan too
All 4 become uncontrollable,can do anything..#PakistanFloods #PakArmy #flood pic.twitter.com/aI5KeRsiwL
— Anurag Amitabhانوراگ امیتابھअनुराग अमिताभ (@anuragamitabh) August 27, 2022
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!