New Year : నూతన సంవత్సర (2026) వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయదారులు, వినియోగదారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నందున, మద్యం విక్రయాల వేళలను పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటల వరకు అమ్మకాలు జరుపుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక బార్లు, క్లబ్బులు , టూరిజం ప్రాంతాల్లోని హోటళ్లు, అలాగే ప్రత్యేకంగా అనుమతి పొందిన ఈవెంట్ నిర్వాహకులకు రాత్రి 1:00 గంట వరకు మద్యం సరఫరా చేయడానికి , సేవించడానికి అనుమతినిచ్చారు. ఈ నిర్ణయం వల్ల నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారికి మరింత ఉత్సాహం కలగడమే కాకుండా, వ్యాపార వర్గాలకు కూడా ఇది పెద్ద ఊరటగా మారింది.
Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే..
అయితే, ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎక్సైజ్ శాఖ అత్యంత కఠినమైన నిఘాను ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ గారి ఆదేశాల మేరకు, డిసెంబర్ 27వ తేదీ నుండే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు , డ్రైవ్స్ ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా వచ్చే మద్యం (NDPL) , నిషేధిత మాదకద్రవ్యాల (NDPS) అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ సిబ్బందితో పాటు ఎస్డీఎఫ్ (SDF), డీటీఎఫ్ (DTF) వంటి ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. డిసెంబర్ 27 నుండి 29 వరకు ముమ్మరంగా దాడులు నిర్వహించి, అనుమానిత ప్రాంతాలను గాలిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
వేడుకలు పరాకాష్టకు చేరుకునే డిసెంబర్ 30 , 31 తేదీలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ రెండు రోజుల్లో ప్రత్యేకంగా ఈవెంట్స్ జరిగే ప్రాంతాల వద్ద నిఘా ఉంచడంతో పాటు, రాష్ట్ర సరిహద్దులు , ప్రధాన రహదారులపై వాహన తనిఖీలు (Vehicle Checking), రూట్ వాచ్ వంటి కార్యక్రమాలను చేపడతారు. నాన్ డ్యూటీ మధ్యం అమ్మకాలను పూర్తిగా అరికట్టడానికి , రాష్ట్రానికి అక్రమంగా లిక్కర్ రాకుండా చూడటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ డైరెక్టర్ వెల్లడించారు. ప్రజలు నిబంధనలకు లోబడి శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, ఎక్కడైనా చట్టవిరుద్ధంగా మద్యం విక్రయాలు జరిగినా లేదా డ్రగ్స్ వంటి అక్రమాలు కనిపించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ