Andhra Pradesh: ఫెన్సింగ్ క్రీడాకారిణి బేబి రెడ్డిని అభినందించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఏపీకి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఫౌండర్ ఆదిత్య మెహతా కలిశారు. వీరిలో ఫెన్సింగ్ క్రీడాకారిణి బేబి రెడ్డి స్వస్ధలం అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లె, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్ షేక్ అర్షద్ స్వస్ధలం నంద్యాల. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం జగన్ వివరించారు.
Read Also: ఇంట్లో పూజించే గణేష్ విగ్రహాలు ఎంత సైజ్‌లో ఉండాలి?
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ (జూనియర్స్ టీమ్)లో బేబి రెడ్డి టీమ్ కాంస్య పతకం గెలవడంతో ఆయా పతకాలను ఆమె సీఎం వైఎస్ జగన్‌కు చూపించారు. జాతీయ స్ధాయిలో టీమ్ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అటు ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్‌లో షేక్ అర్షద్ వెండి, కాంస్య పతకాలు సాధించాడు. దీంతో తాను జాతీయ స్థాయిలో సాధించిన పతకాలను సీఎంకు చూపించాడు. అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో జరగనున్న ట్రాక్ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నట్లు సీఎంకు వివరించాడు. తమకు ప్రభుత్వం నుంచి మరింత సహకారం ఇవ్వాలని బేబిరెడ్డి, షేక్ అర్షద్ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. అటు ముఖ్యమంత్రి జగన్‌ను బేబి రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వెంకట్రామి రెడ్డి, అర్షద్ కోచ్ ఆదిత్య మెహతా కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.

తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు