Matrimony cheat: మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతుల ప్రొఫైల్స్ కనిపిస్తే చాలు సంబంధాలు కలిపేసుకుంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త. ఫొటోలు మాత్రమే యువతులవి. అమ్మాయిల పేరుతో మిమ్మల్ని నిలువునా ఉంచేస్తారు కేటుగాళ్లు. గతంలో ఇదే తరహాలో మోసపోయిన బాధితుడే.. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడు. తనలా మరొకరు మోసపోవద్దని అప్రమత్తం చేయాల్సిందిపోయి.. తనకు జరిగిన అన్యాయమే మరికొందరికి జరగాలని మోసాలకు పాల్పడుతున్నాడు. లక్షలు దండుకున్న కేటుగాళ్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని సూర్యరావుపేటకు చెందిన వ్యక్తి కోమలి సూర్యప్రకాష్.. […]
చట్టాన్ని కాపాడేవాడు.. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే తాను దానిని సరి చేసేవాడు.. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే స్థాయిలో ఉన్నవాడు.. ఇక అతనే తప్పు చేస్తే ఎవరికి చెప్పాలి.. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు వచ్చిన కొత్త సమస్య ఇది.. ఆస్తి పంపకాలలో ఇన్స్పెక్టర్ అయినా కొడుకు తప్పుగా వ్యవహరిస్తుంటే ఎవరికి చెప్పాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు
అదో దోపిడి గ్యాంగ్. హైవేలపై కాపు కాస్తుంది... దాబాల వద్ద మాటు వేస్తుంది...హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ట్రావెల్స్ బస్సులే టార్గెట్ గా రెక్కి నిర్వహిస్తుంది. ప్రయాణికులు బస్సులో నుంచి దిగగానే అందిన కాడికి దోచుకు వెళ్తారు. ఇది మధ్యప్రదేశ్ కంజర గ్యాంగ్ ముఠా పని. చోరీల్లో ఆరితేరిన ఈ గ్యాంగ్ ఆట కట్టించారు సంగారెడ్డి జిల్లా పోలీసులు.
వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే అయితే వీళ్ళు ఎవరు కూడా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. వీళ్లు జల్సాల్ చేస్తుంటారు., డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు.. ఏ పని పాట లేకుండా డబ్బులు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు.. కానీ వీళ్ళు కార్లు మెయిన్టైన్ చేస్తుంటారు. కారులోనే మాత్రం తిరుగుతుంటారు.. రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని […]
Cyber Crime: హర్షద్ మెహతా లాగా వేలకోట్ల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా..? ముకేష్ అంబానీ లాగా కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా..? స్టాక్ మార్కెట్లో మీరు ఒక వెలుగు వెలగాలనుకుంటున్నారా..? అయితే మేము అందిస్తున్న టిప్స్ లో పెట్టుబడి పెట్టండి.. అధిక లాభాలు ఇస్తాం.. అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇబ్బందిగా వస్తున్నాయి ..ఈ మెసేజ్ లను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మనం పూర్తిగా నిండా మోనిగిపోయినట్టే.. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన చూసి గ్రూపులో యాడ్ అయిన ఇద్దరి […]
Drugs Mafia: డ్రగ్స్‌పై తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం మోపింది. డ్రగ్స్ ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు డ్రగ్స్ మాట వినపడద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు వెనుకాడ వద్దని అధికారులకు ప్రభుత్వం కరాకండిగా చెప్పింది. అంతేకాకుండా స్కూల్ స్థాయి వరకు చేరిపోయిన డ్రగ్స్ ని నియంత్రణ చేయకపోతే భవిష్యత్తు తరాలు పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ […]
అమ్మతనం ఎంత మధురమైందో...అంత కఠినమైనది కూడా . ఆ మధురానుభూతిని అనుభవించడం అనే కన్నా ఆస్వాదించడంలో ఉన్న సంతోషం చెప్పలేనిది . ఆ అమ్మతనం దూరమైతే...జీవితకాలం ఆ మధురానుభూతి దక్కదని తెలిస్తే...మనసులో పుట్టే ఆ ఆలోచనలు ఆపడం ఎవరితరం కాదు . మంచి మనిషి అన్న ఆ మనుషులే దొంగ అనే వరకు వస్తుంది . హైదరాబాద్‌లో సరిగ్గా అదే జరిగింది..అమ్మతనం కోసం ఓ మహిళ ఏకంగా కిడ్నాపర్ అవతారం ఎత్తింది .
Hyderabad Crime: గంటల వ్యవధిలో హైదరాబాద్ లో దారుణ హత్యలు జరిగిపోయాయి. 12 గంటల లోపే ఆరుగురు హత్యకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో.. వివిధ తీరులో హత్యలు జరిగాయి. జరిగిన హత్యలపైన పోలీసులు విచారణ ప్రారంభించారు. ట్రాన్స్ జెండర్ గా యువకుడిని మార్చే వేసేందుకు ప్రయత్నం చేయగా.. యువకుడు సూసైడ్ చేసుకోవడంతో అతని సోదరులు కలిసి ట్రాన్స్ జెండర్లను హత్య చేశారు. మరొకటి రోడ్డుపై నిద్రిస్తున్న ముగ్గురు వ్యక్తులను బండరాళ్లతో కొట్టి చంపేశారు. ప్రేమించడం […]
హైదరాబాద్ అరుదైన ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఇంటర్‌పోల్ వెతుకుతున్న కరడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. ‘ప్లానెట్ కిల్లర్స్’ వెబ్ సిరీస్‌లో భాగంగా షాహుల్ హమీద్ పర్యావరణ నేరాలకు సంబంధించి ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్స్ అనే ఎపిసోడ్ నెట్ ఫ్లిక్ లో ఏప్రిల్ 3న ఫ్రాన్స్ టీవీలో ప్రసారం కానుంది.