* చీకటి సామ్రాజ్యాన్ని లఘు చిత్రంగా తెరపైకి
* ఏప్రిల్ 3న ప్లానెట్ కిల్లర్స్ వెబ్ సీరిస్ రిలీజ్
* ఫ్రెంచ్ డాక్యుమెంటరీ సిరీస్‌లో హైదరాబాద్ జర్నలిస్ట్
* మోస్ట్ వాంటెడ్ షాహుల్ హమీద్ పై ఎపిసోడ్
Planet Killers: హైదరాబాద్ అరుదైన ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఇంటర్‌పోల్ వెతుకుతున్న కరడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. ‘ప్లానెట్ కిల్లర్స్’ వెబ్ సిరీస్‌లో భాగంగా షాహుల్ హమీద్ పర్యావరణ నేరాలకు సంబంధించి ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్స్ అనే ఎపిసోడ్ నెట్ ఫ్లిక్ లో ఏప్రిల్ 3న ఫ్రాన్స్ టీవీలో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో సీనియర్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ తన స్వీయ పరిశోధ అనుభవంతో రాసిన బ్లడ్ సాండర్స్ బుక్ రచయిత సుధాకర్ రెడ్డి ఉడుముల కూడా ఈ వెబ్ సీరిస్ లో ఉన్నారు. దుబాయ్‌లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్‌కు సంబంధించిన దర్యాప్తు ఎపిసోడ్‌ను రూపొందించింది. ప్రీమియర్స్ లిగ్నెస్, ప్యారిస్‌లో ఉన్న ఒక స్వతంత్ర నిర్మాణ సంస్థ ప్రెస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్మించిన వెబ్ సిరీస్‌కు హ్యూగో వాన్ ఆఫెల్ దర్శకత్వం వహించారు. ప్లానెట్ కిల్లర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్‌లో పర్యావరణ నేరస్థులను గుర్తించే మార్టిన్ బౌడోట్ నిర్మించారు. ఏప్రిల్ 3న రాత్రి 9:00 గంటలకు ప్రారంభం కానుంది. ది గాడ్‌ఫాదర్ ఆఫ్ ది ఓషన్స్, ది ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ది ఫారెస్ట్ పేర్లతో రెండు భాగాలుగా డాక్యుమెంటరీలు ఫ్రాన్స్ టివిలో ప్రసారం కానున్నాయి.
ఫిల్మ్ డైరెక్టర్ హ్యూగో వాన్ ఆఫెల్
నెట్‌ఫ్లిక్స్‌లో ‘మోస్ట్ వాంటెడ్’ వెబ్ సిరీస్‌లో భాగంగా ‘‘సమంత లెవ్త్‌వైట్: ది వైట్ విడో’ ఎపిసోడ్‌కు హ్యూగో వాన్ ఆఫెల్ దర్శకుడు. ఇంటర్‌పోల్ రెడ్ లిస్ట్‌లో అత్యంతప్రమాదకర పర్యావరణ నేరస్థులను మేము గుర్తించాము. ఎర్రచందనం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ కొండ అడవులకు చెందిన అరుదైనది, ఖరీదైన కలప. చైనా, జపాన్‌లలో సంపన్నులు అత్యంత విలాసవంతమైన ఫర్నిచర్ ఈ కలప ఉపయోగించబడుతుంది. ఈ ఎపిసోడ్ చేయడానికి, ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రికలో పనిచేస్తున్న భారతీయ పరిశోధనాత్మక జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుములతో కలిసి పనిచేసే అద్భుత అవకాశం మాకు లభించింది. అతను ‘బ్లడ్ సాండర్స్ ది గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్’ అనే పుస్తకం ద్వారా ఎర్ర చందనం అక్రమ రావాణాలోని చీకటి సామ్రాజ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.మాకు అతను అందిచిన ఒక గొప్ప సహాయమనే చెప్పాలి. సుధాకర్ రెడ్డి ఉడుముల రాసిన బ్లడ్ సాండర్స్‌లోని ది ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్ కథనం ఆధారంగా తెరకెక్కించాము.హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, చెన్నై, శేషాచలం అడవులు, సింగపూర్, దుబాయ్‌లలో షాహుల్ హమీద్‌పై ఎపిసోడ్ చిత్రీకరించారు. ఇందులో సీనియర్ జర్నలిస్టు సుధాకర్ రెడ్డి ఉడుములతోపాటు పలువురు మాజీ పోలీసు అధికారులు, డిఆర్‌ఐ అధికారులు, ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు. తమిళనాడులోని అభిరామానికి చెందిన షేక్ దావూద్ షాహుల్ హమీద్‌ను పట్టుకునేందుకు ఏపీ పోలీసులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేట కొనసాగిస్తున్నారు.అతను తమిళం, ఉర్దూ, అరబిక్ ఇంగ్లీష్ మాట్లాడగలడని ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులో వెల్లడైంది.
ఫ్రాన్స్ 5 టివి ప్రకారం
ఆసియాలో ఎర్రచందనం సుసంపన్నుల రాజసానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ కలపతో అసాధారణమైన గృహోపకరణాలు లేదా సంగీత వాయిద్య పరికరాలను తయారు చేస్తారు.కానీ ఎర్రచందనం ప్రపంచంలో ఆగ్నేయ భారతదేశంలోని ఒక్క శేషాచలం అడవిలో మాత్రమే పెరుగుతుంది. సైట్ రేంజర్లు అక్రమ రావాణాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎర్రచందనం మాఫియా ఇప్పటికే 95శాతం రక్తచందనం మొక్కలను నాశనం చేశారు. ఎర్ర చందనం అనగానే గుర్తుకు వచ్చే పేరు ఏదైనా ఉంది అంటే అది సాహుల్ హమీద్. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు గాడ్ ఫాదర్ అనే చెప్పాలి.
2016 నుండి ఈ భారతీయ నేరస్థుడి ఇంటర్‌పోల్ పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.ఇతడు కొల్లగొట్టిన అటవీ సంపద అంచనా 120 మిలియన్ డాలర్లు. భారత పోలీసులచే మొదటిసారీ అరెస్టు అనంతరం దుబాయ్‌కి పారిపోయాడు. అక్కడి నుండి తన అక్రమ సామ్రాజ్యానికి నాయకత్వం వహిస్తున్నాడు. అనునిత్యం దుర్భేద్యమైన రక్షణ వలయంలో ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్లు, విల్లాలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. భారతీయ అడవుల నుండి దుబాయ్ మీదుగా సింగపూర్ నౌకాశ్రయం వరకు, అతని ఫాంటమ్ కంపెనీలు, అవినీతి కస్టమ్స్ అధికారులు, ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ కలప అక్రమ వ్యాపార రహస్యాలను సుధాకర్ రెడ్డి ఉడుముల రాసిన బ్లడ్ సాండర్స్‌లోని ది ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్ కథనం వెల్లడిస్తుంది.
IPL 2023: చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు