Fact Check: సోషల్ మీడియాలో అసలు ఏదో నకిలీ ఏదో కనిపెట్టడం కష్టంగా మారుతోంది. అయితే కొందరు నకిలీని అసలుగా భావించి వైరల్ చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య ఫ్లోలో అన్న మాటను పట్టుకుని ఒక వర్గం అదేపనిగా ట్రోల్ చేస్తోంది. అక్కినేని తొక్కినేని అని మాట్లాడటాన్ని భూతద్దంలో పెట్టి కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ మాటను బాలయ్య కావాలని మాట్లాడారా లేదా అన్న విషయం పక్కనపెడితే బాలయ్య పేరుతో ఇప్పుడు ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ లెటర్‌లో పచ్చి బూతులు ఉండటంతో నందమూరి అభిమానులు మండిపడుతున్నారు.
Read Also: Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్.. ఫిబ్రవరిలో బ్యాంకులకు 10 రోజులు సెలవు..
అక్కినేని అభిమానులకు క్షమాపణలు అంటూ బాలయ్య చెప్పినట్లు టీడీపీ లెటర్ హెడ్‌తో కూడిన ఓ పోస్టును ఓ వర్గం అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ లెటర్ చూసిన చాలా మంది నిజంగా బాలయ్య క్షమాపణలు చెప్పాడంటూ చర్చించుకుంటున్నారు. అయితే పూర్తి లెటర్ చదివితే ఇది ఫేక్ అని.. కావాలని సృష్టించినట్లు అర్ధమవుతోందని నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెటర్ సృష్టించిన వారిపై లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని నందమూరి అభిమానులు హెచ్చరిస్తున్నారు. అయినా సంతకం లేని లెటర్‌ను బాలయ్య సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేస్తారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి లెటర్లను ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.
Balayya Garu Public apology to ANR Garu pic.twitter.com/nWp74POMzW
— Lab Reports (@Inside_Infos) January 24, 2023