రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు వివిధ శాఖలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఈ సమావేశాల్లో విద్య, వ్యవసాయ కమిషన్‌లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ఆర్‌ఓఆర్ చట్టాలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.