Mirzapur Season 3: ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మీర్జాపూర్ వెబ్ సిరీస్ నుంచి సీజన్ 3 త్వరలోనే స్ట్రీమింగ్ కి రానుంది. ఈ క్రైమ్ ఇంటెన్స్ డ్రామా సిరీస్‍లో తొలి రెండు సీజన్లు భారీ సక్సెస్ అయ్యాయి. మీర్జాపూర్ ఆధిపత్యం కోసం జరిగే కుట్రలు, ప్రతీకారాలు, హింసతో రెండు సీజన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు, మీర్జాపూర్ మూడో సీజన్ వచ్చేస్తోంది. జూలై 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తరుణంలో సీజన్ 3 ట్రైలర్ తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మీర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ ట్రైలర్ జూన్ 20వ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఓ కొత్త పోస్టర్ ద్వారా ట్రైలర్ డేట్‍ను వెల్లడించింది.
Also Read; Pawan Kalyan: నేడు బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్..
మీర్జాపూర్ సీజన్ 3లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజర్, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాన్షు పైన్యులీ, హర్షిత శేఖర్ గౌర్, రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా ప్రధాన పాత్రలు పోషించారు. మరికొన్ని క్యారెక్టర్లు కూడా తిరిగి వస్తాయనే అంచనాలు ఉన్నాయి. మీర్జాపూర్ మూడో సీజన్‍కు కరణ్ ఆయుష్మాన్, గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహించారు. కరణ్ ఆయుష్మాన్, పునీత్ కృష్ణ క్రియేటర్లుగా ఉన్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఈ సిరీస్‍ను నిర్మించింది. మీర్జాపూర్‌పై ఆధిపత్యం కోసం పోరు మూడో సీజన్‍లోనూ సాగనుంది.
మీర్జాపూర్ తొలి సీజన్ 2018లో వచ్చి బాగా పాపులర్ అయింది. 2020లో వచ్చిన రెండో సీజన్ మరింత భారీ సక్సెస్ అయింది. దీనితో మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‍గా నిలిచింది. ఇక మీర్జాపూర్ మూడో సీజన్ కోసం నాలుగేళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జూలై 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది.