‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’.. నిన్న (ఆగస్ట్ 27) విడుదలైన ఈ సినిమాలో క్లైమాక్స్ బాగుందని ప్రేక్షకుల నుంచి టాక్ వచ్చింది. సుధీర్ బాబు అద్భుతంగా నటించేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో ఇది బెస్ట్‌గా అనిపిస్తుందని పలువురు ప్రశంసలు కురిపిస్తోన్నారు. హీరోయిన్ ఆనంది కూడా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఈ సినిమా విశేషాల గూర్చి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ‘పలాస 1978 చూశాక నాకు […]
మెగాస్టార్ చిరంజీవి, మణిశర్మ ది హిట్ కాంబినేషన్. ‘బావగారు బాగున్నారా!’ మొదలు ‘చూడాలని వుంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, జై చిరంజీవ, స్టాలిన్’ వంటి ఎన్నో సినిమాలను సూపర్ హిట్ పాటలతో బంపర్ హిట్ గా మార్చాడు మణిశర్మ. తాజాగా ‘ఆచార్య’తో ఈ ఇద్దరు మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మణిశర్మ కుమారుడు మహతి సాగర్ తొలిసారి చిరంజీవితో పని చేయబోతున్నాడట. ‘వేదాళం’ రీమేక్ గా మెహర్ రమేశ్ తీస్తున్న ‘భోళా శంకర్’ […]
కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన అజాగ్రత్తగా వుండే మాత్రం ఇక అంతే సంగతిని కరోనా పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి.. రానున్న రెండు నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెపుతున్నాయి. కాగా, ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే సినీ అభిమానులకు పాత రోజులు వచ్చినట్లుగానే థియేటర్లు, సరికొత్త టీవీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంతో అలరిస్తుండగా, సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్-5 షో కూడా ప్రారంభం […]
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. కోవిడ్ కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న ఖచ్చితంగా విడుదలవుతుందని భావించారు. ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే నాని నటించిన ‘టక్ జగదీష్’ అదే రోజున ఓటీటీలో విడుదల కానుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు, సినిమా థియేటర్లలో […]
శుక్రవారం సాయంత్రం నుండి ‘సీటీమార్’ మూవీ సెప్టెంబర్ 3 న విడుదల కాదని, వాయిదా పడుతుందని ప్రచారం సాగుతోంది. దానిని కన్ ఫామ్ చేస్తూ చిత్ర నిర్మాతలు తాజాగా సెప్టెంబర్ 10న తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నయా పోస్టర్ ను రిలీజ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూత పడిన థియేటర్లు పూర్తి స్థాయిలో తెరచుకోక పోవడం, ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ కావడంతో పాటు… ఇటీవల […]
తెలుగు సినిమాకి చెందిన స్టార్ కపుల్ తమ వివాహబంధాన్ని తెగదంపులు చేసుకునే దిశగా పయనిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నాలుగేళ్ళ క్రితం తమ ఏడేళ్ళ ప్రేమను సాకారం చేసుకుంటూ ఓ ఇంటివారైనా ఆ స్టార్ జంట చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది. వీరిద్దరూ తమ కెరీర్‌లో పీక్ దశలో ఉన్నారు. ఇటీవల తన పేరులోంచి భర్త ఇంటిపేరు తొలిగించటంపై ఆ హీరోయిన్ బాలీవుడ్ మీడియాకు వివరణ కూడా ఇచ్చింది. షూటింగ్ కి గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పటంతో ఇకపై తన […]
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనే స్పెషల్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఆ సినిమా విడుదలై ఆగస్ట్ 27తో యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భీమవరంలోని కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్వర్ణోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ”నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుటలలో కృష్ణ చిరస్థాయిగా నిలిచార’ని […]
హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. మృత్యువులోనూ వీడని స్నేహబంధం ఆ మిత్రుల ఆనందాన్ని చూసి.. విధికి కన్ను కుట్టిందో ఏమో.. అప్పటి దాకా ఆనందోత్సాహాలతో గడిపిన ముగ్గురు మిత్రులు అంతలోనే విగత జీవులయ్యారు. ఫ్రెండ్ బర్త్ డే కు కేక్ కోసమని. .బైక్ […]
తమిళనాట కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు అగ్ర దర్శకులు. తెలుగులో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలసి గిల్డ్ పేరుతో సినిమాలు తీస్తున్నట్లు తమిళనాట అగ్రదర్శకులందరూ కలసి ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. తెలుగులో నిర్మాతలు ఎవరికివారు హీరోలతో టై అప్ పెట్టుకుని సినిమాలు తీస్తుంటే తమిళంలో మాత్రం దర్శకులందరూ కలసి ఒకే గొడుగు కింద సినిమాలు తీయబోతున్నారు. మణిరత్నం, శంకర్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, మిస్కిన్, లింగుస్వామి, మురుగదాస్, బాలాజీ శక్తివేల్, శశి, లోకేశ్ కనకరాజ్ […]