తెలుగు సినిమాకి చెందిన స్టార్ కపుల్ తమ వివాహబంధాన్ని తెగదంపులు చేసుకునే దిశగా పయనిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నాలుగేళ్ళ క్రితం తమ ఏడేళ్ళ ప్రేమను సాకారం చేసుకుంటూ ఓ ఇంటివారైనా ఆ స్టార్ జంట చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది. వీరిద్దరూ తమ కెరీర్‌లో పీక్ దశలో ఉన్నారు. ఇటీవల తన పేరులోంచి భర్త ఇంటిపేరు తొలిగించటంపై ఆ హీరోయిన్ బాలీవుడ్ మీడియాకు వివరణ కూడా ఇచ్చింది. షూటింగ్ కి గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పటంతో ఇకపై తన ఫ్యామిలీ కి టైమ్ కేటాయించబోతోందంటూ కథనాలు కూడా వచ్చాయి.
ఏమైందో ఏమో కానీ విభేధాలు తీవ్రమయ్యాయట. వాటిని తొలిగించటానికి రెండువైపు ఫ్యామిలీలు ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేదట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. భర్త ఇంటిపేరు తొలిగించినపుడు తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని రూమర్స్ సృష్టించవద్దని, దాని వల్ల రిలేషన్స్ దెబ్బతింటాయని ఆ హీరోయిన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం విడాకుల విషయం కూడా రూమర్ గా మిగిలిపోవాలని టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ అభిమానులతో పాటు అమ్మడి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి వారు కోరుకుంటున్నట్లు స్టార్ కపుల్ విడాకుల ఆలోచనకు స్వస్తి చెప్పి కలసి మెలసి ఉండాలని ఆశిద్దాం.