చిత్ర విచిత్రమైన సంఘటనలకు మన సినిమా పరిశ్రమ వేదిక అవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు తలచుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా అలాంటి యాదృచ్చికమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఈ సంఘటనకు కారకులు భూమిక, పూజాహేగ్డే కావటం విశేషం. 2000లో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింద భూమిక. ఆ తర్వాత ఏడాదే పవన్ కళ్యాణ్ తో ‘ఖుషీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో భూమికకు వెనుదిరిగి చూసుకునే […]
సెప్టెంబర్ 2న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు జరుపుకొన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మూడు రోజుల ముందు నుంచే అభిమాన సంఘాలను, ఫ్యాన్స్ గ్రూపులను అలెర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర కూడా పలు షోలతో పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాయి. అయితే ఈసారి పవన్ 50వ బర్త్ కావడంతో ఫ్యాన్స్ మరింత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ ట్రెండ్ […]
లాక్ డౌన్ తర్వాత వినోదరంగ ప్రాధాన్యమే మారిపోయింది. థియేటర్లు మూత పడటంతో గత కొంత కాలంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లే ప్రధానమైన వినోద వనరులుగా మారాయి. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ లకు ఆదరణ పెరిగి చందాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల ఓ సర్వే ప్రకారం ఇండియాలో డిస్నీ+ హాట్‌స్టార్ అత్యధిక సభ్యుల సభ్యత్వం పొందిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా నిలిచింది. సినిమాలు, వెబ్ సిరీస్, లైవ్ స్పోర్ట్స్ వంటి యాక్టివిటీతో ఈ ప్లాట్ ఫామ్ పట్ల యూజర్స్ […]
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. మంచి కంటెంట్ దొరికితే భారీ బడ్జెట్ పెట్టడానికి కూడా మన నిర్మాతలు వెనకాడటం లేదు. త్వరలోనే మరో మెగా హీరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు వెంకటేష్ తో వరుణ్ తేజ్ ‘ఎఫ్ […]
(ఆగస్టు 29తో ‘అమావాస్య చంద్రుడు’కు 40 ఏళ్ళు) విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన నూరవ చిత్రం ‘రాజా పార్వై’. నిర్మాతగా కమల్ కు ఇదే తొలి చిత్రం. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ పేరుతో అనువదించారు. తమిళ చిత్రం 1981 ఏప్రిల్ 10న విడుదల కాగా, తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ ఆగస్టు 29న జనం ముందు నిలచింది. కమల్ హాసన్ ఆయన అన్నలు చారుహాసన్, చంద్రహాసన్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో పాలు […]
(ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజు) యంగ్ హీరో విశాల్ సినిమాలంటే మాస్ మసాలాతో నిండి ఉంటాయి. అన్ని వర్గాలను అలరించే ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది. విశాల్ నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. ఇప్పటికీ విశాల్ సినిమా వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూసేవారు తెలుగునాట ఎంతోమంది ఉన్నారు. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి. ఆయన తండ్రి జి.కె.రెడ్డి గతంలో చిత్ర నిర్మాత. చిరంజీవి హీరోగా ‘ఎస్.పి.పరశురామ్’ అనే చిత్రాన్ని జి.కె.రెడ్డి నిర్మించారు. తరువాత తమిళంలోనూ జి.కె.రెడ్డి […]
‘మనీ హెయిస్ట్’.. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ వున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్‌షిప్ ఉన్న సిరీస్ కూడా ఇదే కావటం విశేషం. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్‌లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్‌లో ఐదో పార్ట్ గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు ఎపిసోడ్స్‌గా రిలీజ్ కానుంది. ఆపై డిసెంబర్‌లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా […]
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జునతో పాటు రాధిక, సుహాసిని సహా మెగా కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు. ఈమేరకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేశారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. […]
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో చేపట్టిన పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించిన ఆయన మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి కాళేజీకి చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బసచేయనున్నారు. సంజయ్ బస కోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. […]