అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్3’.. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రంలో ఈసారి సునీల్, అలీ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. తాజాగా ‘ఎఫ్3’ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సెట్‌లో జరిగిన సరదా సన్నివేశాలను ‘ట్రిపుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అంటూ వీడియో విడుదల చేశారు. ఈ సినిమాను ‘సంక్రాంతి’ కానుకగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ‘ఎఫ్2’ మాదిరిగానే ‘ఎఫ్3’ కూడా సంక్రాంతి హిట్ కొడుతుందో లేదో చూడాలి.