హీరో విక్కీ కౌశల్, నిర్మాత రోనీ స్క్రూవాలా, దర్శకుడు ఆదిత్య ధర్… ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిందే సూపర్ హిట్ మూవీ ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’. అయితే, వీరు ముగ్గురు మరోసారి చేతులు కలపబోతున్నారు. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా దర్శకుడు ఆదిత్య ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ రూపొందించనున్నాడు. మహాభారతంలోని గురు ద్రోణుని కుమారుడే అశ్వథ్థామ. ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడని హిందువులు నమ్ముతారు. అటువంటి వీరాధివీరుని పాత్ర ఆధారంగా ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ తెరకెక్కనుందట!
హిందీ సినిమా రంగంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటోన్న సూపర్ హీరో థ్రిల్లర్ ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచీ సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే, గత రెండేళ్లుగా మూవీ టీమ్ ప్రిపరేషన్స్ లో ఉంది. హీరో, హీరోయిన్ విక్కీ కౌశల్, సారా అలీఖాన్ కూడా కొన్ని నెలలుగా రకరకాల యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారట. సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం ఇవి ఉయోగపడతాయని చెబుతున్నారు.
సెప్టెంబర్ లో మొదలై జనవరిలో ముగియనున్న ‘అశ్వథ్థామ’ మూవీ షూటింగ్ ఇండియాతో పాటూ అమెరికా, ఐస్ ల్యాండ్ లాంటి దేశాల్లో జరగనుంది. 2022 మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కే వాడతారట! చాలా ఎక్కువ ఎడిటింగ్, గ్రాపిక, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ సినిమాలో ఉంటుందని ముంబై టాక్. వచ్చే సంవత్సరంలో సినిమాని ముస్తాబు చేసి 2023లో బాక్సాఫీస్ వద్దకి తీసుకువస్తారని అంచన!
చూడాలి మరి, ఇప్పటికే రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ భారీ సూపర్ హీరో మూవీగా మొదలై థియేటర్ల వద్దకి రాలేకపోతోంది. అదే పనిగా వాయిదా పడుతోంది. మరి విక్కీ కౌశల్ సూపర్ హీరో మూవీ ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’కి ఎలాంటి అవాంతరాలు వస్తాయో! అంతా అనుకున్న విధంగా జరిగి త్వరగా మన ముందుకు వస్తే మాత్రం బాలీవుడ్ సూపర్ హీరో సాహసాలు చూసి సూపర్ థ్రిల్ అవ్వొచ్చు…